బిగ్ బాస్ సీజన్ 5లో ఏడవ వారం ప్రియా ఎలిమినేట్ కాబోతోందనే ప్రచారం సోషల్ మీడియాలో ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. 47వ రోజు ఏం జరిగిందో తొలుత వీక్షకులకు చూపించిన నాగార్జున… 48వ రోజు విశేషాలనూ వీక్షకులతో పాటే తానూ చూడటం విశేషం. ఓ చెట్టుకు కోతి బొమ్మలను కట్టి, ఎవరి ఫోటో ఉన్న ఆ కోతి బొమ్మను తీసి వారికి క్లాస్ తీసుకున్నాడు నాగార్జున. ఇందులో భాగంగా ప్రియా ‘చెంప…