Bigg Boss 8 Telugu Elimination This Week: ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై వారం పూర్తి కావస్తోంది. మొన్న ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. ఈ రోజు శనివారం వచ్చేసింది. ప్రతి బిగ్ బాస్ సీజన్ లాగానే ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయం మీద లీక్స్ వచ్చేశాయి. నిజానికి మొదటి వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. విష్ణు ప్రియా, శేఖర్ బాషా, ఆకుల సోనియా, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వి శెట్టి వంటి వాళ్ళు నామినేషన్ లో ఉన్నారు. ఇక ఈ ఆరుగురి విషయంలో నామినేషన్స్ లో మణికంఠను హౌస్ లో ఉన్న వాళ్ళందరూ టార్గెట్ చేయడంతో అతని మీద సింపతి వర్కౌట్ అయ్యి మొదటి టాప్ ప్లేస్ లోకి వచ్చేసాడు.
Shivam Bhaje: ఓటీటీలో దుమ్మురేపుతున్న డివైన్ మిస్టరీ థ్రిల్లర్ ‘శివం భజే’ !!
ఇక మిగతా వాళ్లలో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో విష్ణుప్రియ కూడా ఒకరు. శేఖర్ బాషా రాజ్ తరుణ్ వ్యవహారంతో ఈ మధ్య పాపులర్ కావడంతో అతనికి కూడా కాస్త మంచిగానే ఓట్లు పడ్డాయి. అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే శేఖర్ బాషాకి పడిన ఓట్ల కంటే పృథ్వి, సోనియాకి ఎక్కువ ఓట్లు పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ అనఫీషియల్ వెబ్సైట్లో సాగుతున్న ఓట్లు కాబట్టి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు. ఇక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆమెను దాదాపు హౌస్ నుంచి బయటకు పంపడం ఖాయం అయిపోయినట్లుగానే ప్రచారం జరుగుతోంది. అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది చూడాలి.