తెలుగు సీజన్ 7 బిగ్ బాస్ షో ప్రస్తుతం రచ్చగా మారింది.. తొమ్మిదో వారంకు గాను కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఇంటి సభ్యులను బిగ్ బాస్ రెండు టీమ్స్ గా విభజించాడు. వీర సింహాలు టీమ్ లో రతిక, గౌతమ్, శోభా, భోలే, యావర్, తేజ ఉన్నారు.. అలాగే గర్జించే పులులు టీమ్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అశ్విని, అర్జున్, అమర్ ఉన్నారు. వీరు వాటిని పైపు నుండి పడే బంతులను సేకరించాలి. ఇరు టీమ్ సభ్యులు సంచుల్లో వాటిని నింపి ప్రత్యర్థుల నుండి కాపాడుకోవాలి.. ఇలా ఎవరైతే చివరి వరకు నిలుస్తారో వారే ఈ వారం కెప్టెన్..
ఇకపోతే జంపింగ్ జపాంగ్ టాస్క్ లో వీర సింహాలు టీమ్ గెలిచింది. దాంతో గర్జించే పులులు టీమ్ నుండి ఒకరిని తప్పించే ఛాన్స్ వారికి దక్కింది. వారు పల్లవి ప్రశాంత్ ని తప్పించారు. గర్జించే పులులు టీమ్ వీక్ అయ్యింది. నేటి ఎపిసోడ్లో మరలా బంతులు పడ్డాయి. సేకరించించేకు ఇరు టీమ్స్ కి సంచులు కావాల్సి వచ్చాయి. ముందుగా స్టోర్ రూమ్ లోకి వెళ్లిన అమర్ ప్రత్యర్థి టీమ్ సంచులు కూడా తీసుకున్నాడు. గౌతమ్ వాటిని తిప్పికొట్టాడు..
ఈ సంచుల విషయంలో రతిక-అమర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపు వీరి గొడవతో హౌస్ లో వేడి వాతావరణం నెలకొంది.. ఇద్దరికీ ఇద్దరే.. నువ్వా, నేనా అని మాటలతో పెద్ద యుద్ధమే జరిగింది.. సంచులు కింద పడేయ్యడం పై రతికా, అమర్ ను నిలదీసింది.. అది నా ఇష్టం నా స్ట్రాటజీ అన్నాడు. ఎదవ పని చేసి స్ట్రాటజీ అనకు అని రతిక అన్నది. నువ్వు చేసేవి ఎదవ పనులు, నువ్వంటే ఊస్తున్నారు బయట అని అమర్ అన్నాడు. మాటలు జాగ్రత్తగా రానీ అని రతిక హెచ్చరించింది. అమర్ కూడా తగ్గలేదు. ఇద్దరి మధ్య గొడవ పర్సనల్ వరకూ వెళ్ళింది.. మొత్తానికి ఆ టాస్క్ ను పూర్తి చేశారు.. మరి ఈరోజు బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ను ఇస్తాడో చూడాలి..