Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం కష్టంగా ఉంది! వాళ్ళ మనసులో ఏముందో, ఎందుకలా రియాక్ట్ అయ్యారో తెలుసుకోవడం అంత సులువుగా అనిపించడం లేదు!! అలాంటి పనే సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఇనయా చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఈవారం కెప్టెన్సీ టాస్క్ ఫైనల్స్ లో బాలాదిత్య, సూర్య, రేవంత్ నిలిచారు. బాలాదిత్యకు ఎంతో మెచ్యూరిటీ ఉందని మెజారిటీ కంటెస్టెంట్స్ భావించినా, ఇప్పటికే ఓసారి అతను కెప్టెన్ గా వ్యవహరించాడు అనే ఆలోచనతో అతన్ని పక్కన పెట్టారు కొందరు. అయితే తొలివారం కెప్టెన్ గా ఉన్న తాను, ఆ సమయంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వమని బాలాదిత్య కోరాడు. అంతేకాదు. ఈసారి సూపర్ వైజర్స్ అనే కేటగిరిని పెట్టి సూర్య, రేవంత్ ను నియమించి వారి సలహా సంప్రదింపులతో కెప్టెన్ గా వ్యవహరిస్తానని హామీ ఇచ్చాడు. కానీ చాలామంది దానిని పాజిటివ్ వే లో తీసుకోలేదు.
Read also: Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయంపై దాడి.. విగ్రహాలు ధ్వంసం
సూర్య ఎక్కడ ఉన్నా రాజే అంటూ మునగ చెట్టు ఎక్కించి, అతను కెప్టెన్ గా లేకపోయినా రాణిస్తాడంటూ లైట్ తీసుకున్నారు చాలామంది. ఇదే సమయంలో రేవంత్ కు ఒకసారి ఛాన్స్ ఇస్తే అతను తనను తాను నిరూపించుకుంటాడనే భావనతో కొందరు, ఇతరులు కెప్టెన్ గా ఉన్న సమయంలో అతను చేసిన తప్పులు ఏమిటీ అనేది అర్థం కావాలని కొందరూ ఓటు వేశారు. గత కొద్ది రోజులుగా ఆర్జే సూర్య మనసెరిగి మసులుతున్న ఇనయా డెసిషన్ మాత్రం హౌస్ లోని అందరు సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటింగ్ కు కొద్ది సేపు ముందు కూడా సూర్య పక్షాన మాట్లాడిన ఇనయా… చివరి క్షణంలో ఠక్కున తన చేతిలోని దండను తీసుకెళ్ళి రేవంత్ మెడలో వేసేసింది. ఆ వెంటనే సూర్యను గట్టిగా హగ్ చేసుకుని సారీ చెప్పింది. దీంతో సూర్యతో పాటు రేవంత్ సైతం షాక్ కు గురయ్యాడు. ఇలా ఒకరిద్దరు తమ నిర్ణయాన్ని చివరి క్షణంలో మార్చుకోవడం రేవంత్ కు ఉపయోగపడింది. అయితే… ఆ తర్వాత జరిగిన లెగ్జరీ బడ్జెట్ టాస్క్ టగ్ ఆఫ్ వార్ లో రేవంత్ సంచాలకుడిగా మెప్పించలేకపోయాడు. బిగ్ బాస్ పెట్టిన నిబంధనలను అర్థం చేసుకుని, ఆచరణలో పెట్టడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు అతను ఎలాంటి గొడవలకూ తావు ఇవ్వకుండా కెప్టెన్ గా ఎలా నెగ్గుకొస్తాడనేది వేచి చూడాల్సిందే!
Missing Women Killed: యువతి అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ.. సూత్రధారులు ప్రేమికులే!