బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు ఉత్కంట మారుతుంది.. కంటెస్టెంట్స్ విన్నర్ అవ్వాలని తెగ రెచ్చిపోతున్నారు.. తొమ్మిదో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది.. శోభ తేజ వల్ల తన బాయ్ ఫ్రెండ్ ను గుర్తు చేసుకొని ఏడ్చేసింది.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కంటెంటెండర్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందుకోసం హౌస్లో ఉన్న వారిని రెండు టీమ్స్ గా డివైడ్ చేశాడు బిగ్ బాస్… ఒక టీమ్ కు వీర సింహాలు.. మరో జట్టుకి గర్జించే పులులు అనే పేరు పెట్టారు. వీరసింహాలు టీమ్ లో యావర్, గౌతమ్, భోలే, తేజ, శోభా, రతిక ఉన్నారు. ఈ గర్జించే పులులు టీమ్ లో అర్జున్, ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అశ్విని.. ఈ రెండు టీమ్స్ కు హాల్ ఆఫ్ బాల్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఉంచిన ఓ పైప్ ద్వారా చిన్న చిన్న బాల్స్ పడుతూ ఉంటాయి…
ఆ బాల్స్ ను హైట్ ఎక్కువగా ఉన్న అర్జున్ ఈ టాస్క్ ను పూర్తి చేశాడు.. గౌతమ్ తన సంచి లాగడంతో అర్జున్ కు కోపం వచ్చింది. నేను కూడా లాగేస్తా.. రతికా దగ్గర చాలా బాల్స్ ఉన్నాయి నేను లాగేస్తా అని గట్టిగా అరిచాడు. దాంతో రతికా భయపడిపోయింది.. అలాగే తన బాల్స్ ను ఎవరు దోచుకోకుండా తల కింద దాచి పెట్టింది.. ఫౌల్ గేమ్ అందరు రతికా పై సీరియస్ అయ్యింది.. ఈ టాస్క్ ను పూర్తి చేసిన తర్వాత బిగ్ బాస్ మరో టాస్క్ ను ఇచ్చాడు..
పవర్ బాక్స్ ఛాలెంజ్ అంటూ మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. జంపింగ్ జపాంగ్ అనే గేమ్ ఆడించాడు బిగ్ బాస్. ఒకొక్క టీమ్ నుంచి ఇద్దరు ఆడాల్సి ఉంటుంది. ఒకరు బెలూన్ ఊదుతుంటే మరొకరు ఆ బెలూన్లను టైర్ల మధ్యలో ఫిట్ చేయాలి. ఎవరు విన్ అయ్యితే వారికి ఆ టీమ్ కు ఓ పవర్ వస్తుంది. బెలూన్ ను ఫిట్ చేయడానికి అర్జున్,యావర్ వెళ్లగా.. బెలూన్ ఊదడానికి ప్రశాంత్, తేజ వెళ్లారు.. ఈ టాస్క్ కూడా పూర్తి అయ్యింది.. వీర సింహాలు టీమ్ రెండు బెలూన్ లను ఎక్కువగా ఊదారు.. టాస్క్ లో విన్ అయ్యారు.. ఈరోజు కెప్టెన్ ఎవరో తెలియనుంది..