బిగ్ బాస్ 7 తెలుగులో అప్పుడే గొడవలు మొదలయ్యాయి.. రెండోవారం నామినేషన్ కోసం ఎంపిక పూర్తయ్యింది.. ఇంట్లోని ఒక్కొక్కరి క్యారెక్టర్ బయటపడుతుంది.. హౌస్ లో అందరి చూపు రతిక పైనే ఉంది.. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 7 లో గొడవలు, ఏడుపులు, వార్నింగ్ లతో నానా హంగామా చేస్తున్నారు హౌస్ లో ఉన్న వారు.. ఇక మాయ అస్త్రం కోసం పోటీపడుతున్న కంటెస్టెంట్స్ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రణధీర, మహాబలి టీమ్ పోటీ పడ్డే క్రమంలో హౌస్ లో ఉన్న వారి మధ్య వాదనలు జరిగాయి. ఇదిలా ఉంటే రణధీర టీమ్ మహాబలి టీమ్ పై విజయం సాధించి మాయాస్త్ర రెండో కీని సొంతం చేసుకున్నారు. ఆతర్వాత మాయాస్త్రాను తలో ముక్క పంచుకున్నారు..
ఇక అలాగే బిగ్ బాస్ లో రెండో అస్త్ర పొందేందుకు రణధీర టీమ్ లో ఉన్న వారిలో నుంచి మాయాస్త్ర ముక్కలను తీసుకొని అదే టీమ్ లో ఉన్న వారిలో వేరొకరికి ఇవ్వాలని.. అలా ఎందుకు ఇస్తున్నారో సరైన రీజన్ చెప్పాలని టాస్క్ ఇచ్చాడు. గాంగ్ సౌండ్ విన్న వెంటనే మహాబలి టీమ్ లో ఉన్నవారు మాయాస్త్ర ముక్కలను తీసుకొని రణధీర టీమ్ లో ఉన్నవారికి ఇవ్వాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించారు. మాయాస్త్ర భాగాలు రణధీర టీంలో ఏ ఇద్దరి సభ్యుల దగ్గర ఎక్కువ ఉంటాయో వారు.. పవరాస్త్ర గెలుచుకునేందుకు అర్హులు అని బిగ్ బాస్ చెప్పింది.. ఆ టాస్క్ మొత్తం రాసాభాసగా జరిగింది..
ఇక చివరగా రతిక తన టీమ్ వాళ్లను బపూన్స్ అనడంతో అందరికి కోపం వచ్చేసింది.. ఇక గౌతమ్ గౌతమ్ కు మండిపోయింది. ఈమెకు క్లారిటీ లేదు.. ఫస్ట్ వెళ్తానని చెప్పింది.. ఆతర్వాత సెకండ్ అన్నది.. ఫోర్త్ అన్నది.. ఇప్పుడు లాస్ట్ అంటుంది.. అందర్నీ మాటలని నోరు జారుతుందని ఫైర్ అయ్యాడు. చివరకు షకీలా రాతిక బండారాన్ని బయటపెటేసింది. కంటెంట్ ఇవ్వడం కోసం ఆమె ట్రై చేస్తుంది.. ఎంత సేపు గోల చేస్తే అంత కంటెంట్ వస్తుందని రతిక ప్రయత్నం.. ఇవ్వనివ్వండి.. అంటూ రతిక నిజ స్వరూపన్ని బయటపెట్టింది.. షకీలా బయటపెట్టింది.. ఇక ఈవారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి..