బిగ్ బాస్ లో ఊహించిందే జరిగింది.ఏడో వారం కూడా అమ్మాయే బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి రెండు వారాలకే ఎలిమినేట్ అయింది.. ఆమె ఆట తీరు నచ్చకో లేక, ఇంకేదో కారణం అనేది తెలియలేదు.. కానీ జనాల ఓటింగ్ తక్కువగా ఉండటంతో పూజ బయటకు వచ్చింది.. బాస్ ఏడో సీజన్ ఏడు వారాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ ఏడు వారాల్లోనూ మహిళలే ఎలిమినేట్ కావడం గమనార్హం. ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీలా, దామిని భట్ల, రతికా రోజ్, శుభ శ్రీ, నయని హౌజ్ నుంచి బయటకు వెళ్లి పోగా తాజాగా పూజా మూర్తి కూడా ఎలిమినేట్ అయ్యారు.
ఈ సీరియల్ నటి మొదటగానే బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టాల్సి ఉండేది.. సడెన్ గా తండ్రి మరణించడంతో వైల్డ్ కార్డు తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. వచ్చి రాగానే హౌస్ లో ఉన్న సీరియల్ బ్యాచ్ తో కలిసి పోయింది.. ఇక తనతో పాటు వచ్చిన అశ్విని తో రావడం రావడమే గొడవ పెట్టుకుంది.. అలాగే ఆటను కూడా సరిగ్గా ఆడలేదు.. అలాగే తన మార్క్ తో ఎక్కడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.. దాంతో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది..
బిగ్ బాస్ హౌస్ లో ఏడోవారం డేంజర్ జోన్‌లో సింగర్ భోలే షా వళి, అశ్విని, పూజా మూర్తి ఉండగా.. తక్కువ ఓట్లు వచ్చిన పూజా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. మొత్తానికి బిగ్ బాస్‌లో వచ్చిన రెండు వారాలకే బయటకు వెళ్లిపోయిందీ సీరియల్ నటి. ఇదిలా ఉంటే పూజా మూర్తి బిగ్ బాస్‌లో అందరి కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు వారాలకు కలిపి కేవలం రూ. 3 లక్షలు మాత్రమే తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అంటే వారానికి కేవలం రూ. 1.5 లక్షలు మాత్రమే తీసుకుందని సమాచారం.. ఇప్పటివరకు బిగ్ బాస్‌లో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్‌గా పూజా మూర్తి నిలిచింది.. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి..