బిగ్ బాస్ 7 ఐదో వారం నామినేషన్స్ హాట్ హాట్ గా జరుగుతున్నాయి.. ఈ సీజన్ జనాల ఊహలకు అందకుండా ఉందని తెలుస్తుంది.. ముందుగా చెప్పినట్లుగా ఉల్టా పుల్టా ఉంది.. ఊహించని విధంగా ఎలిమినేషన్ జరుగుతుంది.. ఇక హౌస్ లో ఇప్పుడు 10 మంది మాత్రమే ఉన్నారు. త్వరలో కొంతమంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక హౌస్ లో ఈ వారం నామినేషన్ చాలా హాట్ హాట్ గా సాగాయి. సోమవారం రోజు జరిగిన ఎపిసోడ్ లో శివాజీ మీద అందరు కసి తీర్చుకున్నారు. అతితెలివితో శివాజీ తన పవర్ అస్త్రను పోగొట్టుకున్నాడు.
హౌస్ లో కొంతమందికి మాత్రమే ఫెవర్ గా ఉంటున్నాడని మెజారిటీ మెంబర్స్ చెప్పడంతో అతడి దగ్గర నుంచి పవర్ అస్త్రను లాగేసుకున్నారు బిగ్ బాస్. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్లలో అతను కూడా గేమ్ ఆడాల్సిందే.. ఇక ఈరోజు జరిగే ఎపిసోడ్ ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశారు.. ఈ ప్రోమోలో ముందుగా డాక్టర్ బాబు గౌతమ్ లాయర్ పాప శుభశ్రీ తో పులిహోర కలపడం.. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనిపించేలా ఓ లవ్ ట్రాక్ చూపించారు.. ఇక గత వారం పవర్ అస్త్ర లను తిరిగి ఇచ్చేయ్యాలని బిగ్ బాస్ కోరాడు..
దాంతో సందీప్, శోభా, ప్రశాంత్ తమ పవర్ అస్త్రాలను తిరిగి ఓ బాక్స్ లో పెట్టేసి బిగ్ బాస్ కు అప్పజెప్పారు. దాంతో శివాజీ లోపల ఉన్నమరో కోణం బయటకు వచింది. దాంతో అతడు ఏయ్ ఏయ్ రో అంటూ పాటలు పాడాడు. వెటకారంగా నవ్వుతు తనలోని మరో కోణాన్ని చూపించాడు. దాంతో శోభాకు కోపం వచ్చింది. కొంతమంది ఉంటారు. తమకు రాకపోయినా పర్లేదు పక్కవాడికి రాకూడదని సంతోషపడతారు అంటూ అసహ్యయించుకుంటుంది.. చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ రసవత్తరంగా ఉండనుందని తెలుస్తుంది.. మరి ఎలా ఉంటుందో చూడాలి..