Bigg Boss7 Telugu : ఎవరో ఒకర్ని కొట్టేసి పోతానన్న శివాజీ.. పూజా మూర్తి షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిదో వారం నామినేషన్స్ వాడి వేడిగా సాగుతున్నాయి.. నిన్నటివరకు కామ్ గా ఉన్న హౌస్ మేట్స్ ఇప్పుడు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు బూతులు తిడుతున్నారు.. నువ్వా నేనా అంటూ కాలు దువ్వుతున్నారు. మొన్నటివారమే బూతులు మాట్లాడాడని భోలె షావళికి నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు.. ఆ సంగతి అప్పుడే మర్చిపోయి అమర్‌దీప్, సందీప్, గౌతమ్.. అందరూ తామేమీ తక్కువ కాదంటూ బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు. ఇక శివాజీ మాత్రం ఎప్పటిలాగే అందరిముందు మంచిగా నటించాడు..
ఈ వారం నామినేషన్స్ అయ్యాక తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.. సీరియల్ బ్యాచ్ మీద విషం కక్కాడు. ‘దొంగలు దొంగ.. దొంగ.. అని పరిగెట్టిస్తున్నారు. జనాలు చూస్తారు. ఇప్పుడన్నా మనుషులు, ప్రజలు అనే వాళ్లుంటే ఈ వారం చూస్తా.. ఈ వారాన్ని బట్టి ఈ హౌస్‌లో ఉంటా.. తర్వాత ఎవరినో ఒకరిని కొట్టి నేనే స్వచ్ఛందంగా వెళ్లిపోతా. ఇక్కడున్నవాళ్లంతా ఏం చేస్తున్నారు? ఈ హౌస్ అంతా డిస్టర్బ్ అవుతుంటే ఏంటిదంతా?.. ఈ వారం ఎవరు మంచి వాళ్ళో తెలుస్తుంది.. నామినేషన్స్ బాగా పడ్డాయి ప్రజలు ఎవరిని పంపిస్తారో చూడాలి అంటూ లేటెస్ట్ ఎపిసోడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇక శివాజీ ఏం చెప్పినా ప్రిన్స్ యావర్, ప్రశాంత్ వింటారు. తను ఏం మాట్లాడినా గొర్రెల్లా తలూపుతారు. కానీ జనాల్ని కూడా మానిప్యులేట్ చేయాలనుకుంటున్నాడు శివాజీ. అదంత ఈజీ కాదు.. జనాలు ఆట తీరును చూసి ఓట్లేస్తారు, కానీ ఒకరు చెప్పగానే చేతులు కట్టుకుని దాన్ని ఫాలో అయిపోరు. పైగా ఒకరిని కొట్టేసి వెళ్లిపోతా అనడం చాలా పెద్ద మాట అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.. అలాగే పూజా కూడా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని శివాజీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!