Ganesh Chaturthi: గణేశ్ ఉత్సవాలు ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమయ్యాయి?.. హైదరాబాద్ కి ఈ సంస్కృతి ఎప్పుడు వచ్చింది?
- గణనాయకుడి పండుగ వచ్చేసింది
- వీధి వీధినా కొలువుతీరనున్న బొజ్జ వినాయకుడు
- హడావుడి చేస్తున్న యువకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గణనాయకుడి పండుగ వచ్చేసింది. వీధి వీధినా బొజ్జ వినాయకుడు కొలువుతీరనున్నాడు. మండపాల ఏర్పాట్లు, విగ్రహాల కొనుగోళ్లు చేస్తూ యువకుల హడావుడి చేస్తున్నారు. అయితే.. దేశ స్వతంత్య్రకాంక్షను రగిలించడంకోసం, యువతను ఏకం చేసేందుకు 1893లో మహారాష్ట్ర పుణె కేంద్రంగా సర్వ జనైఖ్య గణేశ్ ఉత్సవాలకు నాయకులు పిలుపునిచ్చారు. గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ వేడుకల్లో కుల మతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొన్నారు. లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేశోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు. నాటి నుంచి వినాయక నవరాత్రులు మహారాష్ట్రను దాటి భారతదేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
READ MORE: Liquor Bottles: దొంగిలించిన మద్యం పంపకం విషయంలో గొడవ.. స్నేహితుడి దారుణ హత్య
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
1893వ సంవత్సరానికి ముందు గణేష్ ఉత్సవాలను ప్రైవేట్‌గా లేదా చిన్న స్థాయిలో నిర్వహించుకునేవారు. బ్రిటీష్ బానిసత్వం, మొఘల్‌లతో సహా ఇతర విదేశీ ఆక్రమణదారుల అణచివేత మొదలైనవి దీని వెనుకగల కారణాలని చెబుతుంటారు. హిందువులు నాటిరోజుల్లో తమ ఇళ్లలోనే గణపతిని పూజించేవారు. స్వాతంత్య్ర పోరాట విప్లవ నాయకుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ దేశప్రజల ఐక్యతను, సామూహిక స్ఫూర్తిని పెంపొందించేందుకు గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముందడుగు వేశారు. నిమజ్జనం సందర్భంగా గణపతి పందాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి తిలక్ శాంతియుత ఆయుధంగా మలచుకున్నారు.
READ MORE:Fitness Tips: వ్యాయమం చేసే ముందు ఈ పని చేయడం లేదా..? గుండెపోటు వచ్చే ప్రమాదం
బాలగంగాధర్ తిలక్ పిలుపుతో హైదరాబాద్‌లో కూడా వినాయకుడి వేడుకలు మొదలయ్యాయి. హైదరాబాద్ సిటీ పాతబస్తీ శాలిబండ దగ్గరున్న భారత గుణవర్థక్ సంస్థను 1895లో ఉగాది రోజున స్థాపించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న మహారాష్ట్రీయులు బాలచంద్ర దీక్షిత, వక్రతుండ దీక్షిత, నారాయణరావు పిల్‌ఖానె, లక్ష్మణరావు సదావర్తె, దాదాచారి కాలెమిత్ర బృందం సారథ్యంలో మరాఠా సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ.. తిలక్ స్పూర్తితో గుణవర్థక్ సంస్థ ప్రాంగణంలో వీధుల్లో వినాయకచవితి వేడుకలను ప్రారంభించింది.
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!