Sravana masam 2022: శ్రావణ శుక్రవారం ప్రాధాన్యత.. వివాహితులు ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన తెలుగు మాసాల్లో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రాధాన్యత.. ఈనేపథ్యంలో.. జూలై 28వ తేదీన ఆషాఢ మాసం పూర్తయి, 29వ తేదీన శ్రావణ మాసంలోకి అడుగు పెడుతున్నాం. నేటి ఈ ఏడాది శుక్రవారంతో శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడితో కూడిన మాసం కాబట్టే దీనికి శ్రావణమనే పేరు వచ్చింది. శ్రీ మహా విష్ణువు నక్షత్రం కూడా శ్రవణమే కాబట్టి దీన్ని శ్రీ లక్ష్మీ నారాయణ మాసంగా భావిస్తారు. ఈ నెలలో సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాల పూజలు, నోములు, వ్రతాలతో దాదాపు నెలరోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. అయితే.. ఈ నెలలో శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు. ఎందుకంటే.. ఈ కాలంలో చంద్రుని నుండి కలిగే అశుభ ఫలితాల నుండి తప్పించుకునేందుకు, మానసిక శాంతిని కాపాడుకునేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రావణ మాసంలో అనేక పండుగలు, పూజలు, వ్రతాలు జరుపుకుంటారు.
read also: Madhya Pradesh: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు.. మెజారిటీ స్థానాలు కైవసం
Also Read
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
ఇక హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా పరిగణిస్తారు. అంతేకాదు.. ఈ సమయంలో మంగళ గౌరి దేవిని కలశ రూపంలో ప్రతిష్టించి, మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. కొందరు తమ ఇళ్లల్లోనే ముత్తయిదవులను ఆహ్వానించి వ్రతాన్ని చేస్తారు.. రక రకాల పిండి వంటలతో పాటు పండ్లను, పూలను అమ్మవారికి సమర్పిస్తారు. అయితే.. ఈ నెలలో అన్నింటికంటే ముఖ్యమైనది లక్ష్మీదేవి పూజ. శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మీకి వివాహితులు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని, తమకు ఆదాయానికి ఎలాంటి ఢోకా ఉండదని చాలా మంది నమ్ముతారు.
లక్ష్మీ అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటారు కానీ.. లక్ష్మీ అంటే ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, గుణం, సంతానం వంటి కోరికలన్నీ నెరవేరుస్తుంది. అందుకే ఆ మాతను ఎక్కువగా ఆరాధిస్తారు. ఈమాసంలో.. పెళ్లిళ్లు కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి. కొత్తగా పెళ్లైన వధువుతో అత్తగారింట్లో వరలక్ష్మీ వ్రతం చేయిస్తారు. ఈనేపథ్యంలోనే తనకు పూజలు, వాటి విధానం, అమ్మవారి ప్రాముఖ్యత గురించి తెలుస్తుందని భావిస్తారు. ఇలా శ్రావణ శుక్రవారం రోజు పూజ చేయడం వల్ల తమ కుటుంబానికి సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. వరలక్ష్మీ వ్రతంలో భాగంగా నవ వధువుకు చారుమతీ గురించి వివరిస్తారు.
పురాణాల ప్రకారం.. చారుమతి అనే స్త్రీ ఎల్లప్పుడూ నిండు కుండలా అణకువగా ఉంటుందని, అత్తమామలను బాగా చూసుకుంటుందని, అలాంటి మహిళలకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని, ఇదే విధంగా కొత్త పెళ్లికూతురు తన అత్తమామలను మంచిగా చూసుకోవాలని, అప్పుడు తనకు కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతుంటారు. ప్రతి ఇంటిలో గృహిణిలు ఇంటిని శుభ్రంగా, శాంతంగా ఉండేలా చూసుకుంటారో, అలాంటి వారి ఇంట్లో అన్నీ పనులు సరైన సమయానికి విజయవంతంగా పూర్తవుతాయని చాలా మంది నమ్మకం.
తాజావార్తలు
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!