మన తెలుగు మాసాల్లో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రాధాన్యత.. ఈనేపథ్యంలో.. జూలై 28వ తేదీన ఆషాఢ మాసం పూర్తయి, 29వ తేదీన శ్రావణ మాసంలోకి అడుగు పెడుతున్నాం. నేటి ఈ ఏడాది శుక్రవారంతో శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడితో కూడిన మాసం కాబట్టే దీనికి శ్రావణమనే పేరు వచ్చింది. శ్రీ మహా విష్ణువు నక్షత్రం కూడా శ్రవణమే కాబట్టి దీన్ని శ్రీ లక్ష్మీ నారాయణ మాసంగా భావిస్తారు. ఈ నెలలో…