చదువుల తల్లి సరస్వతి దేవి అనుగ్రహం ఉంటేనే చదువుల్లో రానిస్తారు.. అందుకే ప్రతి పాఠశాలలోను సరస్వతి దేవి విగ్రహాలు ఉంటాయి. మనం ఎంత కష్టపడి చదివినా ర్యాంకులు రాలేదని భాధపడతారు.. అలాంటి వారు సరస్వతి దేవిని భక్తితో పూజిస్తే అత్యున్నత ర్యాంకులు సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు.. ఎలా పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
విద్యా దేవత విద్యార్ధులచే ఆరాధించబడుతుంది. సరస్వతి పూజను ఆయుధపూజగా నిర్వహిస్తారు. ఈ రోజున తెలుపు, పసుపు చీరలను ధరించడం మంచిది.. అలాగే సరస్వతీ దేవికి సంబంధించిన స్తోత్రాలతో పఠించడం మంచిది. ఈ రోజున అమ్మవారికి పసుపు రంగు పుష్పాలను సమర్పించడం విశేషం. బంతి, చామంతి పూలతో పూజలు చెయ్యడం మంచిది..కేసరి, కుంకుమపువ్వు , లడ్డూ, హల్వా, కిచిడీ, పాయసం వంటివి సమర్పించవచ్చు.
సరస్వతీ పూజకి తెల్లపూలు వాడాలి. చదువుకునే విద్యార్థులు ప్రత్యేకంగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వీలైతే తెల్లవస్త్రాలు, లేదా పట్టుబట్టలు ధరించాలి.. ఎప్పుడూ ఈ పూజ చేసినా సాయంత్రం 6.30 గంటల నుండి 7.30 గంటల వరకు మంచి సమయం అని జ్యోతిష్య నిపుణలు చెప్తున్నారు… అలాగే అమ్మవారికి 108 బిందెల నీటితో అభిషేకం చేస్తే అమ్మవారు సంతోషిస్తారు.. అలాగే లేనివారికి మీకు తోచిన విధంగా పుస్తకాలు ఇవ్వడం మంచిది..