నాలుగవ రోజు కోటి దీపోత్సవం కార్యక్రమంలో శ్రీ ప్రకాశానందేంద్ర సరస్వతి స్వామి, శ్రీ అవధూతగిరి మహారాజ్, మహంత్ శ్రీ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్, శ్రీ స్వరూపానందగిరి స్వామి వార్లు దీపోత్సవం గురించి, కోటి దీపోత్సవాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తూ వస్తున్న తుమ్మల నరేంద్ర చౌదరి గురించి అనుగ్రహభాషణం చేయగా, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు కార్తిక మాసం, దీపపు కాంతి, దీపారాధన, కోటి దీపోత్సవం ప్రాముఖ్యతను మరియు భక్తుల కోసం కైలాసాన్నే కిందకు దింపిన ఎన్టీవీ, భక్తిటీవీ చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరిని ప్రస్తావిస్తూ ప్రవచనామృతం చేశారు.
వీరితో పాటు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. వెంకటేశ్వర రెడ్డి గారు ఈ దీపోత్సవానికి హాజరై ఈ కోటి దీపోత్సవం భాగ్య నగరానికే ఒక కొత్త శోభను తెస్తుందని చెప్పగా, అతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని, ఈ అవకాశమిచ్చిన భక్తిటీవీ వారికి కృతజ్ఞతలు తెలియచేశారు.
వీటితో పాటు వేదిక మీద రాహుకేతు పూజ, భక్తులతో నాగపడగలకు రాహుకేతు పూజ, శ్రీ కాళహస్తీశ్వర కల్యాణం, గజ, సింహ వాహన సేవలు జరిగాయి. ఇవి కాక రోజూ జరిగే జ్యోతి ప్రజ్వలన, బంగారు లింగోద్భవం, మహా నీరాజనం, వచ్చిన అతిథులకు గురు వందనం, సప్త హారతి వంటి కార్యక్రమాలు జరిగాయి.