శివుడిని భక్తితో కొలిస్తే కోరికలను నెరవేరుస్తాడు.. ఆయన అభిషేక ప్రియుడు.. అందుకే భక్తులు కచ్చితంగా శివుడికి అభిషేకం చేయాలనుకుంటారు. అభిషేకం చేయడం వల్ల అటు ఆధ్యాత్మికం, ఇటు ఆరోగ్య పరంగానూ ఎన్నో లాభాలున్నాయి.. ఇలాంటి అభిషేకం చెయ్యడం వల్ల ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.. శివునిని అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు వుండవు. తద్వారా ఆ కుటుంబం సుఖ సంతోషాలతో నిండి పోతుంది..
ఇక ఆవుపాలతో శివునికి అభిషేకం చేస్తే సర్వ సుఖాలు కలుగుతాయి. పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళప్రదమైన శుభకార్యాలు జరుగుతాయి.మారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభిస్తాయి. గరిక నీటితో శివాభిషేకం చేయించిన వారికి నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు. పెరుగుతో శివునికి అభిషేకం చేయిస్తే.. ఆరోగ్యం చేకూరుతుంది.. పంచదారతో, రుద్రాక్షాలతో అభిషేకం చేయిస్తే సకల సంతోషాలతో నిండిపోతుంది..
శివుడికి ఎలా అభిషేకం చేయొచ్చు?
మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును..