Koti Deepotsavam 2022: ప్రతీ ఏటా ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది.. అక్టోబర్ 31వ తేదీన ఈ మహా యజ్ఞానికి అంకురార్పణ జరిగింది.. ఈ నెల 14వ తేదీతో కోటి దీపాల ఉత్సవం ముగియనుంది.. ఇప్పటికే 10 రోజుల పాటు విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహించిన రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. 11వ రోజు కార్యక్రమ నిర్వహణకు సిద్ధమైంది..
ఇక, పద కొండవ రోజు జరగనున్న విశేష కార్యక్రమాలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
* అనుగ్రహ భాషణం: త్రిదండి శ్రీ జయపతాక స్వామీజ (ఇస్కాన్ వరల్డ్ హెడ్, మాయాపూర్, వెస్ట్ బెంగాల్), త్రిదండి శ్రీ భాను స్వామి మహరాజ్ (ఇస్కాన్, మేనేజ్‌మెంట్ హెడ్),
మాతా నితాయి సేనాని (ఇస్కాన్, విశాఖపట్నం), శ్రీ సాంబదాస స్వామీజీ (ప్రెపసిడెంట్ ఇస్కాన్, విశాఖపట్నం)
* ప్రవచనామృతం: బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు
* వేదికపై పూజ: అన్నవరం సత్యదేవుని వ్రతం
* భక్తులచే పూజ: విష్ణుమూర్తి విగ్రహాలకు సత్యనారాయణ వ్రతం
* కల్యాణం: అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి కల్యాణోత్సవం
* వాహనసేవ: శేష వాహన సేవ నిర్వహించనున్నారు.. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోన్న కోటి దీపోత్సవానికి ఆహ్వానం పలుకుతున్నాయి ఎన్టీవీ, భక్తి టీవీ, వనితా టీవీ.. తరలి రండి.. ఈ కోటి దీపోత్సవంలో భాగస్వాములు కండి.. భగవంతుడి కృపకు పాత్రులు కండి..