Guru Purnima 2025: ఈశా యోగా సెంటర్‌లో సద్గురు సత్సంగం.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు..!
- ఈశా యోగా సెంటర్‌లో గురు పూర్ణిమ వేడుకలు..
- సద్గురు సత్సంగం.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
- సాయంత్రం 7 గంటల నుండి సద్గురు సత్సంగం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guru Purnima 2025: ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకులకు, ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అనేది సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి. ఆదియోగి మొదట ఆదిగురువుగా మారి తన ఏడుగురు శిష్యులైన సప్త ఋషులకు యోగ శాస్త్రాలను అందించిన పవిత్రమైన రోజు. ఇది భారతదేశంలో పవిత్రమైన గురు శిష్య పరంపర ప్రారంభాన్ని సూచిస్తుంది. అప్పటి నుండి, గురు పూర్ణిమ మన గురువులకు కృతజ్ఞతలు తెలియజేసే ఒక గొప్ప అవకాశంగా ఉంటూ వస్తోంది. దీన్ని భారతదేశమంతటా చాలా ఆనందంతో ఇంకా భక్తితో జరుపుకుంటారు.
కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్, సద్గురు ఆశ్రమంలో, మెడిటేటర్లు ఇంకా మరిన్ని ఆశ్రమవాసులు ఈ ఏడాది జూలై 10న గురు పూర్ణిమని జరుపుకుంటున్నాయి. ఈ సంవత్సరం కార్యక్రమాలు, సంబరాల విశేషాలను ఇక్కడ చూద్దాం..
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
సద్గురు అర్పణం:
ఈ ఏడాది మొదటిసారిగా, సద్గురు అర్పణం అనే ఏడు రోజుల ఆన్‌లైన్ సాధనని అందిస్తున్నారు. ఇది పవిత్రమైన గురు పూర్ణిమ రోజున ముగుస్తుంది. ఇందులో పాల్గొనేవారు ప్రత్యేకమైన గురు పూర్ణిమ మంత్రం, ధ్యానలింగానికి పవిత్రమైన సమర్పణతో సాధనని ముగిస్తారు.
ధ్యానలింగం వద్ద పూర్ణిమ సమర్పణలు:
భక్తులు ధ్యానలింగంలో క్షీరార్పణం (పాల అర్పణ), జలార్పణం (నీటి అర్పణ) సమర్పించవచ్చు. క్షీరార్పణం సాధారణంగా ఉదయం (6 AM నుండి 1 PM వరకు) అందిస్తారు. జలార్పణం మధ్యాహ్నం అలాగే సాయంత్రం (1 PM నుండి 8 PM వరకు) అందిస్తారు. ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి రోజు ధ్యానలింగానికి క్షీరార్పణం, జలార్పణం అర్పించి.. దాని శక్తితో అనుసంధానమై ధ్యానలింగ అనుగ్రహాన్ని పొందే శక్తివంతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇది గురు పూర్ణిమన రోజున భక్తులు గురువుతో తమ అనుబంధాన్ని మరింత గాఢతరం చేసుకోవడానికి ఇదొక అరుదైన అలాగే పవిత్రమైన అవకాశం.
గురు పూర్ణిమ సంబరాలు:
ఈసారి కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో జరుగుతున్న గురు పూర్ణిమ సంబరాలలో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సద్గురుతో ప్రత్యేక సత్సంగం. సాయంత్రం 7 గంటల నుండి ప్రారంభమైయ్యే ఈ సత్సంగంలో సద్గురుచే శక్తివంతమైన గైడెడ్ ధ్యానం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఈశా సంగీత బృందం సౌండ్స్ ఆఫ్ ఈశాతో కలిసి ప్రసిద్ధ కళాకారుల అద్భుతమైన ప్రదర్శనలు, మోహిత్ చౌహాన్, రామ్ మిర్యాల, పార్థివ్ గోహిల్, స్వగత్ రాథోడ్ వంటి ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనలు జరగనున్నాయి. ఉత్సాహభరితమైన ప్రపంచ స్థాయి ప్రదర్శన అందిచేందుకు త్రినిదాదియన్ సోకా కింగ్ మాచెల్ మాంటానో కూడా ఇందులో పాల్గొంటున్నారు.
సద్గురు సత్సంగం లైవ్‌స్ట్రీమ్:
వ్యక్తిగతంగా హాజరు కాలేని వారు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానల్స్ లేదా ఎంపిక చేసిన ఈశా స్థానిక కేంద్రాలలో గురు పూర్ణిమ సత్సంగం లైవ్‌స్ట్రీమ్‌లో చేరవచ్చు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ, ఒడియా, నేపాలీ ఇంకా ఇతర ప్రపంచ భాషలలో కూడా లైవ్‌స్ట్రీమ్ అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!