మాములుగా దేవుడికి అంటే ఎంతోపద్దతిగా పులిహోర, దద్దోజనం కనిపిస్తాయి.. ఇంకా పండ్లు, పూలు అనేవి కామన్.. కానీ ఎప్పుడైనా దేవాలయంలో దేవుడికి నైవేద్యంగా మాంసం పెట్టడం ఎప్పుడైనా, ఎక్కడైనా పెట్టడం చూశారా.. కనీసం విన్నారా? లేదు కదూ.. కానీ ఓ ఆలయంలో వినాయకుడికి మాత్రం మాంసం నైవేద్యంగా పెడుతున్నారు.. ఇది వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఆలయం గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర కర్ణాటకలోని ఓ వినాయకుడి గుడిలో ఇలా నైవేద్యం పెడుతున్నారు.. వినాయకుడి పూజలో అక్కడి ప్రజలు గణేశుడికి మాంసం, చేపలు, చికెన్ నైవేద్యంగా పెడతారట. సావాజీ కమ్యూనిటీ ఈ విశిష్టమైన ఆచారాన్ని నిర్వహిస్తోంది. రకరకాల నాన్ వెజ్ వంటకాలను నైవేద్యంగా పెడుతుంటారు. తరతరాలుగా ప్రతి ఏటా కొన్ని కుటుంబాలు కలిసి ఇలా మాంసాలను నైవేద్యంగా పెట్టడం ఒక ఆచారంగా నడుస్తోంది..
ఉత్తర ప్రజలు భక్తిశ్రద్ధలతో శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు. శ్రావణ నుంచి గణేశ్ చతుర్థి వరకు నాన్ వెజ్ ముట్టుకోరు. నానవెజ్ డైట్‌ను ఎలుకల వారంతో మళ్లీ ప్రారంభిస్తారు..ఇక అప్పుడు నైవేద్యంలో కూడా మటన్ వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మటన్ మసాలా, మటన్ బోటీ, మటన్ ఖీమా తదితర వంటకాలను అందిస్తారు. అలాగే కొంతమంది చేపలు, చికెన్ కూడా అందిస్తారు. చేపలలో మూరంగి చేప ముషాక్‌కు ఇష్టమైనదిగా చెబుతారు…ఆహార రూపంలో తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. రోటీ, ఎడ్మి మొదలైన వంటకాలను కూడా అందిస్తారు. ఈ విశిష్టమైన ఆచారం ఎప్పుడు మొదలైందో తెలియదు. అయితే వందల ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది.. తాజాగా దీనికి సంబందించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వార్త బయటకు వచ్చింది.. పవిత్రమైన వినాయకుడికి ఇలా చెయ్యడమేంటి అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..