ఆదిదేవుడు వినాయకుడుకి బుధవారం అంటే చాలా ఇష్టమైన రోజు.. ఈరోజు ఆయన భక్తులు భక్తితో పూజలు చేస్తారు.. భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే వినాయకుడి పూజకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం ఎంతో అవసరం. మన కష్టాలను తొలగించి కోరుకున్న కోరికలను తీర్చడానికి గణేషుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని వస్తువులను ఆయనకు సమర్పిస్తారు.. అదే విధంగా కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.. మరి వస్తువులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శివయ్య కు లాగే తులసి కూడా వినాయకుని పూజలో నిషేధించబడింది.తులసి ఆకులను గణపతి తీర్థంలో కూడా ఉంచకూడదు.. ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే తులసి పూజలో కనిపిస్తుంది.ఒక సారి చంద్రుడు వినాయకుడిని వెక్కిరించాడు. అప్పుడు కోపం వచ్చి చంద్రుడు తన అందాన్ని కోల్పోతాడని వినాయకుడు శపించాడు… అందుకే తెల్లటి చందనం, తెల్లని వస్త్రం, తెల్లని పవిత్ర ధారం మొదలైనవి కూడా సమర్పించకూడదు. అలాగే ఈ పూజలో విరిగిన అక్షింతలను ఉపయోగించకూడదు..
అలాగే వాడిన పూలను, నలిగిన దండలను అస్సలు వాడకూడదు.. దండలు ఉపయోగించకూడదు. వాటిని పూజలు ఉపయోగించడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి.ఇంకా చెప్పాలంటే వినాయకుడిని పూజించే పూజలో బంతి పూలు, ఎర్రటి పువ్వులు సమర్పించవచ్చు.. ఈ పూలతో పూజ చెయ్యడం వల్ల కోరిన కోరికలు వెంటనే తిరుతాయి.. ఇలా ప్రతి బుధవారం చెయ్యడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయి..