Chitragupta Temple Telugu Vlog in Hyderabad: ఏ తెలుగు ఇంట చూసినా ఎన్టీవీ వార్తలు వినిపించాల్సిందే, భక్తి టీవీ పాటలు, మహనీయుల శ్రవణాల గొంతులు వినిపించాల్సిందే. తెలుగు వారిలో ఒక భాగమైపోయిన భక్తి టీవీ ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా వీలాగ్స్ చేయడం మొదలు పెట్టింది. మొదటిగా చిత్రగుప్తుడి ఆలయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడు గురించి తెలుగు సినిమాల పుణ్యమా అని మనందరికీ తెలుసు. అయితే అలాంటి చిత్రగుప్తుడికి దేవాలయాలు ఉంటాయని మన ఊహకు కూడా అందదు. ఆయితే శ్రీరాముడు అయోధ్యలో చిత్రగుప్తుడికి ఆలయం కట్టించి పూజించినట్లు పురాణాల్లో ఉంది,. ఆ ఆలయమే ఇప్పుడు ధర్మ హరి చిత్రగుప్త దేవాలయంగా వర్ధిల్లుతుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, రామ్‌ఘాట్, ఉజ్జయిని ప్రాంతాల్లో కూడా చిత్రగుప్తుడికి ఆలయాలు ఉన్నాయి. ఇక చిత్రగుప్తుడికి సౌతిండియాలో కేవలం రెండే రెండు ఆలయాలున్నాయి. అందులో ఒకటి తమిళనాడు కంచిలో ఉండగా మరొకటి మన రాష్ట్రంలో అదీ హైదరాబాద్లో ఉండటం గమనార్హం. అది కూడా ఫలక్ నామలోని కందికల్ గేట్ దగ్గర చిత్రగుప్తు మహాదేవ దేవాలయం ఉంది. ఈ ఆలయానికి 250 ఏళ్ల చరిత్ర ఉందంటే నమ్మక తప్పదు. పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శతాబ్దాలనాటి చిత్రగుప్త ఆలయం మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఉంది.
Krithy Shetty: యువత ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం బాధ కలిస్తోంది.. పోలీసులకు సహకరించాలి!
భూలోకానికి అప్పుడప్పుడు వచ్చిపోయే చిత్రగుప్తుడికి ఈ దేవాలయం నివాసం అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడిలో కొలువైన చిత్రగుప్తుణ్ని నవాబుల వద్ద పనిచేసే గుమాస్తాలు ఆరాధ్య దైవంగా కొలిచేవారని చెబుతారు. కాయస్థ వంశీయుడు, అప్పటి మంత్రి రాజా కిషన్ ప్రసాద్ ఈ దేవాలయాన్ని కట్టించారని నమ్మిక. చిత్రగుప్తుడితో పాటు ఆయన భార్యలు నందిని, శోభావతి విగ్రహాలను కూడా అక్కడ ప్రతిష్ఠించారు. కాయస్థ వంశీయులు కేతు గ్రహానికి గురువుగా భావించే చిత్రగుప్తుణ్ని పూజిస్తే దోష నివారణ జరుగుతుందని ప్రగాఢంగా నమ్మేవారు. అయితే కాలక్రమేణా ఆ వంశస్తులు అంతరించిపోవడం వల్ల ఈ ఆలయం నిరాదరణకు గురైనా 1980లలో ఈ ఆలయం మళ్లీ వెలుగులోకి రావడంతో వివిధ రాష్ట్రాల భక్తులు ఇక్కడకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక దాతల సాయంతో చిత్రగుప్తుడి పక్కనే రామాలయం, శివాలయం, సాయిబాబా, ఆంజనేయస్వామి, అయ్యప్ప ఆలయాలు కూడా నిర్మించారు.
అభిషేకానికి సంబంధించిన వివరాలు కావాలంటే క్రింది వీడియో క్లిక్ చేయండి