Krithi Shetty Crucial Comments on Drugs: హైదరాబాద్ లోని యూసుఫ్‌గూడ 1వ బెటాలియన్ (TSSP)లోని శౌర్య కన్వెన్షన్ సెంటర్ లో డ్రగ్స్ దుర్వినియోగం & అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో 3వ రోజు ముఖ్య అతిథులుగా హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి, టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, డిజిపి అంజనీ కుమార్, నగర పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ పాల్గొన్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ డ్రగ్స్ ను కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కాలంలో యువత ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం బాధ కలిగించే విషయం అని పేర్కొన్న ఆమె దేశానికి యువత ప్రతిభ చూపించాల్సిన వారు డ్రగ్స్ మాయలో పడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
Kamal Hassan: కమల్ హాసన్ని ఒక రేంజ్లో లేపుతున్నారు..కానీ అసలు విషయం ఇదా?
డ్రగ్స్ బారిన పడకుండా యువతను రక్షించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్న ఆమె ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలు అరికట్టడంలో బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలనలో మన వంతు పాత్ర పోషించాలని మరీ ముఖ్యంగా పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు. నిజానికి ఈమధ్యనే టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగింది, కేపీ చౌదరి అనే నిర్మాత డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడడంతో అతని ఫోన్లో అనేక లింకులు బయట పడ్డాయి. ఇక కృతి శెట్టి సినిమాల విషయానికి వస్తే ఉప్పెనతో ఓ రేంజ్‌కు వెళ్లిన కృతి శెట్టికి ఇప్పుడు అంత టైం బాలేదు. ముందు వాంటెడ్ హీరోయిన్ అనిపించుకున్న కృతి ఇప్పుడు రేసులో వెనుకబడింది. కృతి నటించిన సినిమాలేవి పెద్దగా ఆకట్టుకోవడం లేదు, గత ఏడాది వరుసగా మూడు ప్లాప్స్ వచ్చాయి. దీంతో ఆమెకి కాస్త డిమాండ్ తగ్గింది.