Potatoes and Diabetes: బంగాళదుంపలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన కూరగాయలలో ఒకటి. ఉడికించినా, వేయించినా, మంటలో కాల్చినా లేదా గ్రిల్ చేసినా ఎలా చేసుకొని తిన్నా రుచిగా ఉంటాయి. కానీ, ఆరోగ్యపరంగా కొందరు బంగాళదుంపల్ని పూర్తిగా మానేయడమే మేలు అనుకుంటారు. షుగర్ పేషంట్స్ అయితే ఈ విషయంలో కాస్త ఎక్కువగానే జాగ్రత్త పడుతారు. ఎందుకంటే, బంగాళదుంపలు రక్తంలో షుగర్ స్థాయిని పెంచుతాయని భావిస్తారు. అయితే ఇది నిజమేనా? మధుమేహం ఉన్న వారు బంగాళదుంపల్ని పూర్తిగా మానేయాలా? ఈ సందేహాన్ని కొందరు నిపుణులు నివృత్తి చేస్తున్నారు.
Read Also: Thug Life: ‘‘థగ్ లైఫ్’’ రిలీజ్ చేయాలి, ఇది మీ కర్తవ్యం.. కర్ణాటకపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
మధుమేహం ఉన్నవారు బంగాళదుంపలు తినచ్చా?
బంగాళదుంపల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉన్నా, ఎక్కువ భాగం స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఈ స్టార్చ్ శరీరంలో వేగంగా జీర్ణమై రక్తంలో షుగర్ స్థాయిని వేగంగా పెంచుతుంది. నిపుణల ప్రకారం, బంగాళదుంపలు ఉడకబెట్టినా, అరకొరక ఉడికించినా, కాల్చినా లేదా వేయించినా వాటిలోని స్టార్చ్ ప్రభావం మారదు. కాబట్టి, మధుమేహం ఉన్నవారు బంగాళదుంపల వినియోగాన్ని పూర్తిగా కాకపోయినా, కొద్దీ మేర తినడం తగ్గించుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు.
బంగాళదుంపలను వేయించకుండా, ఉడకబెట్టి లేదా కాల్చి తినడం ఉత్తమం. ఈ విధంగా వంట చేస్తే వాటిలోని పోషక విలువలు దెబ్బతినకుండా ఉంటాయి. ముఖ్యంగా అధిక కొవ్వులు కూడా చేరవు. కానీ, ఆరోగ్యకరమైన వంటకంగానే వాడినా, బంగాళదుంపల్లో ఉండే స్టార్చ్ పరిమాణం మారదు. అందుకే, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండేందుకు బంగాళదుంపలను ప్రోటీన్ లేదా పచ్చి కూరగాయలతో కలిపి తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!
నిజానికి మార్కెట్లో అనేక రకాల బంగాళదుంపలు లభిస్తాయి. వీటిలో మధుమేహం ఉన్నవారికి స్వీట్ పొటాటోస్ (చిలగడదుంపలు), చరిస్మా, నికోలా లాంటి బంగాళదుంపలు మెల్లగా జీర్ణమయ్యే గుణాన్ని కలిగి ఉండి, తక్కువ GI (గ్లైసెమిక్ ఇండెక్స్) కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ స్థాయిని వేగంగా పెంచకపోవడంతో మంచి ఎంపికగా చెప్పవచ్చు. బంగాళదుంపలను వేయించకుండా, ఉడికించి లేదా కాల్చి వాడడం మంచిది. వాటిని ప్రోటీన్ లేదా ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలతో కలిపి తింటే కార్బోహైడ్రేట్ ప్రభావం తక్కువగా ఉంటుంది. మొత్తంగా బంగాళదుంపలు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ, అవి రక్తంలో చక్కెర స్థాయిని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. మోతాదు, వంట విధానం, ఇంకా ఇతర పోషకాలతో కలిపి తీసుకునే పద్ధతిని పాటిస్తే, మధుమేహం ఉన్నవారు కూడా బంగాళదుంపలను ఓ హెల్తీ కూరగాయగా తినవచ్చు.