Skoda: చెక్ రిపబ్లిక్ ఆటోమేకర్ దిగ్గజం స్కోడా ఇండియాలో తన కార్లను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇప్పటికే స్కోడా నుంచి కుషాక్, స్లావియా, కోడియాక్ వంటి కార్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఇండియాలో ఉన్న బెస్ట్ కార్లలో స్కోడా కార్లు ఒకటి. గ్లోబల్ ఎన్-క్యాప్ రేటింగ్‌లో పెద్దలు, పిల్లల భద్రతలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్ పొందాయి. మిస్ సైజ్ SUV సెగ్మెంట్‌లో స్కోడా కుషాక్ భారత్‌లో మంచి సేల్స్ నమోదు చేస్తోంది. కుషాక్ ప్రస్తుతం ఇండియన్ మార్కె్ట్‌లోని హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్, టాటా హారియర్, మారుతీ సుజుకి గ్రాండ్ విటారాకు ప్రత్యర్థిగా ఉంది.
ఇదిలా ఉంటే, ఇండియాలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కి మంచి ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం అమ్ముడవుతున్న కార్లలో ఈ కేటగిరి కార్లే అధికంగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న స్కోడా కొత్త మోడల్‌ని బరిలోకి దించబోతోంది. టాటా నెక్సాన్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, మారుతి సుజుకీ బ్రెజ్జా, కియా సోనెట్, హ్యందాయ్ వెన్యూ. మహీంద్రా XUV 3XOలకు పోటీగా స్కోడా కారును సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం కుషాక్, స్లావియా నిర్మితమవుతున్న MQB-AO-IN ప్లాట్‌ఫారమ్‌పై ఈ కొత్త కారు నిర్మితమవుతుంది. ఈ స్కోడా కారు 2025 తొలి అర్ధబాగంలో భారత మార్కెట్‌లో ప్రారంభించబడుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ కారు పేరును వెల్లడించలేదు.
Read Also: Darshan Case: రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీకి యాక్టర్ దర్శన్..
కొత్త స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉంటుందని తెలుస్తోంది. 6-ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్‌గా ఈ కారులో రానున్నాయి. దీంతో పాటు SUV LED హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు మహీంద్రా XUV 3XO అందిస్తున్నట్లుగా లెవల్-2 ADAS ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీ 3-సిలిండర్, 1.0 లీటర్ టీఎస్ఐ ఇంజన్‌తో వస్తుంది. దీనినే కుషాక్, స్లావియాలో ఉపయోగిస్తున్నారు. గరిష్టంగా 115 పీఎస్ పవర్, 175ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ టార్క్ కన్వర్టర్‌లో వస్తుంది. దీని ధర రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల( ఎక్స్-షోరూం) వరకు ఉండే అవకాశం ఉంది. స్కోడా 2026 నాటికి భారత్‌లో 1,00,000 యూనిట్ల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.