డిసెంబర్ 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా వెల్లడైంది. ఈ జాబితాలో మరోసారి మారుతీ సుజుకీ కార్ల ఆధిపత్యం కనిపించింది. మారుతీ సుజుకీకి చెందిన బ్రెజ్జా డిసెంబర్ 2024లో 17,336 యూనిట్లు అమ్ముడైంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది! స్విఫ్ట్, ఎర్టిగా, వ్యాగన్‌ఆర్ వంటి కార్లను వెనక్కి నెట్టేసింది. అయితే.. డిసెంబర్ లో విక్రయించిన టాప్ 5 మోడల్‌లు 15వేల మార్కును దాటాయి. వీటిలో తేడా చాలా తక్కువగా ఉంది.