లాస్‌వేగాస్ వేదికగా జరిగిన CES 2026 టెక్ షోలో Nvidia మరోసారి టెక్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. రోబోలు, ఆటోనమస్ వాహనాల పరిశోధన కోసం Alpamayo పేరుతో ఓపెన్-సోర్స్ AI మోడల్స్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో అధునాతన AI మోడళ్లు, సిమ్యులేషన్ టూల్స్, వేల గంటల డ్రైవింగ్ డేటాసెట్ ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక, Nvidia తెలిపిన వివరాల ప్రకారం.. Alpamayo 1 అనేది ఆటోనమస్ వాహనాల పరిశోధన కోసం రూపొందించిన తొలి చైన్ చైన్-ఆఫ్-థాట్ (CoT) తార్కికత VLA (విజన్-లాంగ్వేజ్-యాక్షన్) మోడల్.. ఇది ఇప్పటికే Hugging Face ప్లాట్‌ఫామ్‌లో ఉచితంగా లభిస్తోంది.
ముఖ్యమైన స్పెసిఫికేషన్లు:
* ఈ మోడల్‌లో 10 బిలియన్ పరామీటర్లు ఉన్నాయి..
* వీడియో ఇన్‌పుట్‌ను విశ్లేషించి డ్రైవింగ్ మార్గాలను (paths) రూపొందిస్తుంది..
* ప్రతి నిర్ణయం వెనుక AI ఆలోచనాను దశలవారీగా చూపిస్తుంది..
* డెవలపర్లు దీనిని రియల్ వాహనాల కోసం తేలికపాటి వెర్షన్‌గా మార్చుకోవచ్చు..
* దీనిపై ఎవాల్యుయేటర్లు, ఆటో-లేబెలింగ్ టూల్స్ కూడా నిర్మించుకోవచ్చు.. ఈ మోడల్‌తో పాటు ఓపెన్ వెయిట్స్, స్క్రిప్ట్స్, ట్రైనింగ్ కోడ్ కూడా Nvidia అందిస్తోంది. రాబోయే వెర్షన్లు మరింత శక్తివంతంగా, వాణిజ్య వినియోగానికి అనువుగా అప్‌గ్రేడ్ అవుతాయని కంపెనీ వెల్లడించింది.
Read Also: Maria Machado: అధికారం కోసం ట్రంప్‌తో ఎలాంటి చర్చలు జరపలేదు.. మచాడో ప్రకటన
1,700+ గంటల భారీ డ్రైవింగ్ డేటాసెట్ విడుదల
అల్పమాయో లాంచ్‌లో భాగంగా Nvidia, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్, ప్రమాదకర డ్రైవింగ్ దృశ్యాలతో కూడిన 1,700 గంటలకు పైగా ఫుటేజ్ ఉన్న ఓపెన్ డేటాసెట్‌ను విడుదల చేసింది. ఈ డేటా ద్వారా AI మోడళ్లు రోడ్డుపై ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితులను ముందే నేర్చుకునే అవకాశం ఉంది. అలాగే, రియల్ రోడ్డు పరీక్షలు ప్రమాదకరమైనవని భావించిన Nvidia, AlpaSim అనే ఓపెన్-సోర్స్ సిమ్యులేషన్ టూల్‌ను GitHubలో రిలీజ్ చేసింది.
* సెన్సార్లు, ట్రాఫిక్, రోడ్డు పరిసరాలను వాస్తవ ప్రపంచంలా సృష్టించవచ్చు
* AI వాహనాలను సురక్షితమైన వర్చువల్ వాతావరణంలో భారీ స్థాయిలో పరీక్షించవచ్చు
* పొరపాట్లు, ప్రమాదాలను సిమ్యులేషన్‌లోనే గుర్తించి సరిచేయవచ్చు
* చైన్-ఆఫ్-థాట్ (CoT)తో భద్రత, నమ్మకం పెంపు
ఇక, అల్పమాయో మోడళ్లు చైన్-ఆఫ్-థాట్ ఆధారంగా పని చేస్తాయి. అంటే AI కేవలం నిర్ణయం తీసుకోవడం కాదు.. ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో కూడా వివరంగా చెప్పగలదు. Nvidia అభిప్రాయం ప్రకారం, AI నిర్ణయాలు మనుషులకు అర్థమయ్యేలా చూపించడంతో భద్రత, విశ్వాసం, ట్రస్ట్ మరింత పెరుగుతాయి. కాగా, Alpamayo వ్యవస్థలకు Nvidia తన Halos Safety Systemను భద్రతా బ్యాకప్‌గా ఉపయోగిస్తోంది అని హాలోస్ సేఫ్టీ సిస్టమ్ + CEO జెన్సన్ హువాంగ్ పేర్కొన్నారు. భౌతిక AI ప్రపంచానికి ఇదే ChatGPT అన్నారు. సెల్ఫ్-డ్రైవింగ్ వాహనాలు ఇకపై రోడ్డును చూడటమే కాదు, పూర్తి స్థాయిలో ఆలోచించి, ముందుకు కొనసాగుతాయని పేర్కొన్నారు. కఠన పరిస్థితుల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకుంటాయని వెల్లడించారు.
కొత్త ఆశలు- సరికొత్త ఆందోళనలు..
అల్పమాయోను Nvidia ఆటోనమస్ డ్రైవింగ్‌లో పెద్ద బ్రేక్‌త్రూగా చూపిస్తోంది. కానీ, 10 బిలియన్ పరామీటర్ల AI మోడళ్లు.. వేల గంటల డ్రైవింగ్ డేటా, ప్రపంచవ్యాప్తంగా డెవలపర్ల స్వేచ్ఛా ప్రయోగాలు, ఆవిష్కరణలకు ఎంత వరకు దోహదపడతాయో, అంతే గందరగోళానికి కూడా కారణమయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. AI పరిశోధన వేగం నియంత్రణ, నిబంధనలు, నమ్మకం కంటే చాలా ముందుకు వెళ్లిపోతోందనే ప్రధాన చర్చ జరగుతుంది. అయితే, షియోమి ఫోన్ కంపెనీ నుంచి ఈవీ కార్ల తయారీదారుగా మారినట్టే.. Nvidia కూడా ఇప్పుడు GPU కంపెనీతో సెల్ఫ్-డ్రైవింగ్, రోబోటిక్స్‌కు AIకి ఫౌండేషన్ కంపెనీగా ఎదుగుతుంది.