బెంగళూరుకు చెందిన న్యూమెరోస్ మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ “డిప్లోస్ మాక్స్”ను పూణేలో లాంచ్ చేసింది. ఈ స్కూటర్‌ను 2025 భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మొదటిసారిగా పరిచయం చేశారు. తర్వాత దశల వారీగా వివిధ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇది న్యూమెరోస్ కంపెనీ నుండి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ స్కూటర్ ప్రత్యేకంగా ప్రైవేట్ వినియోగదారుల కోసం తయారు చేశారు. దీని ధర రూ. 1.13 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే). ఈ స్కూటర్ 2.67 kW (3.5 bhp), 138 Nm టార్క్‌ను జనరేట్ చేసే హబ్-మౌంటెడ్ PMS మోటారుతో శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 63 కిమీ/గంట వేగాన్ని అందుకోవచ్చు. స్కూటర్‌లోని 1.85 kWh రెండు లిథియం-అయాన్ బ్యాటరీలు, ఎకో మోడ్‌లో 140 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. అలాగే.. 1.2 kW ఛార్జర్ ఉపయోగించి ఈ స్కూటర్‌ను 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
Read Also: Team India: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్ టూర్కు దూరం..!
డిజైన్& ఫీచర్లు
డిప్లోస్ మాక్స్‌లో రౌండ్ LED హెడ్‌లైట్లు, స్ప్లిట్ సీట్లు, అండర్ సీట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. అంతేకాకుండా.. ఈ స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఇందులో రైడింగ్ మోడ్‌లు, జియోఫెన్సింగ్, వెహికల్ ట్రాకింగ్, దొంగతనం హెచ్చరిక వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇవే కాకుండా.. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక ట్విన్ షాక్‌లు ఉన్నాయి. ఇవి అన్ని రకాల రోడ్లపై సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. ఈ స్కూటర్‌లో 150mm గ్రౌండ్ క్లియరెన్స్, మెరుగైన బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్‌లు కూడా ఉన్నాయి.
పోటీ & మార్కెట్ విస్తరణ
డిప్లోస్ మాక్స్.. అథర్ రిజ్టా, ఓలా S1 X, TVS iQube, బజాజ్ చేతక్ వంటి ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడనుంది. ప్రస్తుతం న్యూమెరోస్ మోటార్స్.. కర్ణాటక, తమిళనాడు, కేరళలోని 14 నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ కంపెనీ 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 50 నగరాల్లో 100కి పైగా డీలర్‌షిప్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. పూణేలో ప్రారంభించిన తర్వాత.. మహారాష్ట్రలో మరో 20 డీలర్‌షిప్‌లను ప్రారంభించడానికి కంపెనీ నిర్ణయించింది.
న్యూమెరోస్ మోటార్స్ వ్యవస్థాపకుడు, CEO శ్రేయాస్ శిబులాల్ మాట్లాడుతూ, “భారతదేశంలో సమర్థవంతమైన మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో మేము కట్టుబడి ఉన్నాము. డిప్లోస్ మాక్స్ స్థిరత్వం, భద్రత, సాంకేతిక ఆవిష్కరణల గొప్ప ఉదాహరణ.” భారతీయ కస్టమర్ల అవసరాలను తీర్చడానికి.. ఎలక్ట్రిక్ మొబిలిటీ భవిష్యత్తును రూపొందించడానికి కంపెనీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
మీరు స్టైలిష్, మన్నికైన, దీర్ఘ-శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే.. న్యూమెరోస్ డిప్లోస్ మాక్స్ ఒక గొప్ప ఎంపిక కావచ్చు. దీని శక్తివంతమైన బ్యాటరీ, అధునాతన ఫీచర్లు, సరసమైన ధర ఈ స్కూటర్‌ను భారతీయ మార్కెట్లో బలమైన పోటీదారుగా చేస్తాయి.