క్యాష్, ఎక్స్చేంజ్, కార్పొరేట్ బెనిఫిట్లు.. Nissan Magnite మోడల్స్ పై రూ.1,36,000 వరకు భారీ డిస్కౌంట్..!
- నిస్సాన్ మ్యాగ్నైట్‌పై డిసెంబర్ నెలలో రూ. 50,000 నుంచి రూ. 1.36 లక్షల వరకు భారీ ఆఫర్లు.
- క్యాష్ బెనిఫిట్లు, ఎర్లీ బుకింగ్ బోనస్, ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ బెనిఫిట్లు అందుబాటులో.
- నాన్ టర్బో వేరియంట్లలో గరిష్టంగా రూ. 72,000 వరకు ప్రయోజనాలు.
- టెక్న, టెక్న+ వేరియంట్లకు రూ. 1,16,000 వరకు బెనిఫిట్లు.
- EZ-Shift మోడళ్లలో రూ. 62,000 నుంచి రూ. 1,16,000 వరకు ఆఫర్లు.
- Turbo MT మోడళ్లకు అన్ని ట్రిమ్‌లలో రూ. 1,11,000 డిస్కౌంట్.
- Turbo CVT అసెంటా మోడల్‌కు అత్యధికంగా రూ. 1,36,000 ఆఫర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nissan Magnite: నిస్సాన్ మ్యాగ్నైట్ సంబంధించిన ఈ డిసెంబర్ నెల ఆఫర్లు ఈసారి వినియోగదారులకు భారీ మొత్తంలో ప్రయోజనాలు అందిస్తున్నాయి. వేరియంట్‌ను బట్టి కనీసం రూ. 50,000 నుంచి గరిష్టంగా రూ. 1.36 లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. క్యాష్ బెనిఫిట్లు, ఎర్లీ బుకింగ్ బోనస్, ఎక్స్చేంజ్ ఆఫర్లు, కార్పొరేట్ బెనిఫిట్లతో కూడిన ఈ ఆఫర్లు నిస్సాన్ మ్యాగ్నైట్ అన్ని వేరియంట్లకు వర్తించనున్నాయి.
Cricket Marriage Controversies: స్నేహం–వివాహం–వివాదం! స్నేహితుడి భార్యతో స్టార్ క్రికెటర్..
Also Read
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
ఈ ఆఫర్స్ లో భాగంగా నాన్ టర్బో వేరియంట్లలో Visia, Visia+, Kuro ట్రిమ్‌లకు రూ. 10,000 క్యాష్ బెనిఫిట్, ఇతర కార్ల మార్పిడిపై రూ. 20,000 లభించనుంది. ఇక నిస్సాన్ లేదా రెనాల్ట్ మోడల్‌ల ఎక్స్చేంజ్పై రూ. 40,000 ప్రయోజనం లభిస్తుంది. కార్పొరేట్ ఆఫర్ లేకపోయినా రూ. 50,000 వరకు లభిస్తుంది. అలాగే అసెంటా, N-కనెక్ట వేరియంట్లలో రూ. 10,000 క్యాష్, రూ. 7,000 ఎర్లీ బుకింగ్ బోనస్, ఇతర కార్లపై రూ. 30,000, నిస్సాన్ లేదా రెనాల్ట్ కార్లపై రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు రూ. 5,000 కార్పొరేట్ ఆఫర్ కూడా ఉంది. దీని ద్వారా రూ. 72,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇక టెక్న, టెక్న+ వేరియంట్‌ల్లో మరింత ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు. రూ. 10,000 క్యాష్, రూ. 25,000 ఎర్లీ బుకింగ్ బోనస్, ఇతర కార్లపై రూ. 50,000, నిస్సాన్ లేదా రెనాల్ట్ కార్లపై రూ. 60,000తో పాటు రూ. 5,000 కార్పొరేట్ ఆఫర్ కలిపి మొత్తం ప్రయోజనం రూ. 1,16,000కు ప్రయోజనం అందుతుంది.
EZ-Shift వేరియంట్లలో కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. Visia EZ-షిఫ్ట్ లో రూ. 5,000 క్యాష్, రూ. 12,000 ఎర్లీ బుకింగ్ బోనస్, ఇతర కార్లపై రూ. 20,000, నిస్సాన్/రెనాల్ట్ ఎక్స్చేంజ్పై రూ. 40,000తో పాటు రూ. 5,000 కార్పొరేట్ ప్రయోజనం లభిస్తుంది. దీనితో మొత్తం రూ. 62,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అసెంటా, N-కనెక్ట EZ-షిఫ్ట్ ట్రిమ్ లలో రూ. 10,000 క్యాష్, రూ. 12,000 ఎర్లీ బుకింగ్ బోనస్, ఇతర కార్ల మార్పిడిపై రూ. 40,000, నిస్సాన్/రెనాల్ట్ కార్లపై రూ. 60,000, రూ. 5,000 కార్పొరేట్ బెనిఫిట్‌తో మొత్తం రూ. 87,000 ప్రయోజనం ఉంటుంది. కురో, టెక్న, టెక్న+ EZ-షిఫ్ట్ వేరియంట్లలో మరింత మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 10,000 క్యాష్, రూ. 25,000 ఎర్లీ బుకింగ్ బోనస్, ఇతర కార్లపై రూ. 50,000, నిస్సాన్/రెనాల్ట్ కార్లపై రూ. 60,000, రూ. 5,000 కార్పొరేట్ ఆఫర్‌తో మొత్తం రూ. 1,16,000 ప్రయోజనాలు పొందవచ్చు.
IndiGo: నార్మలైజ్ అంటే ఇదేనా?.. ఇండిగో సీఈఓ పోస్ట్‌పై నెటిజన్ల ఫైర్
ఇక టర్బో వేరియంట్లలో Turbo MT మోడళ్లకు అన్ని వేరియంట్లలో ఒకే రకమైన ఆఫర్లు వర్తిస్తాయి. రూ. 10,000 క్యాష్, రూ. 20,000 ఎర్లీ బుకింగ్ బోనస్, ఇతర కార్లపై రూ. 50,000, నిస్సాన్/రెనాల్ట్ కార్లపై రూ. 60,000 బోనస్, రూ. 5,000 కార్పొరేట్ బెనిఫిట్‌తో మొత్తం రూ. 1,11,000 లభిస్తుంది. టర్బో CVT వేరియంట్లలో అత్యధిక డిస్కౌంట్ అసెంటా మోడల్‌కే లభిస్తుంది. రూ. 20,000 క్యాష్, రూ. 35,000 ఎర్లీ బుకింగ్ బోనస్, ఇతర కార్ల పై రూ. 50,000, నిస్సాన్/రెనాల్ట్ మోడల్‌లపై రూ. 60,000, రూ. 5,000 కార్పొరేట్ ప్రయోజనంతో మొత్తం రూ. 1,36,000 డిస్కౌంట్ లభిస్తుంది. మిగతా Turbo CVT వేరియంట్లైన N-Connecta, Kuro, Tekna మరియు Tekna+ మోడళ్లకు రూ. 1,03,000 ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!