Kia Sonet facelift: ADAS ఫీచర్లతో కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్.. ఈ నెల 14న ఆవిష్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kia Sonet facelift: కియా ఇండియా నుంచి కొత్త సోనెట్ ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. మిడ్ సైజ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో కియా నుంచి సోనెట్ కూడా తన ప్రత్యర్థులకు ధీటుగా ఉంది. ఈ సెగ్మెంట్లో విపరీతమైన పోటీ ఉండటంతో దీన్ని తట్టుకునేందుకు కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మరింత స్టైలిష్‌గా, అధునాతన ఫీచర్లతో రాబోతోంది. డిసెంబర్ 14న కొత్త సోనెట్‌ని ఆవిష్కరించనున్నారు. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ డిసెంబర్ 14న ఆవిష్కరించబడుతుంది. ప్రస్తుతం కియా సోనెట్‌కి పోటీగా మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఉన్నాయి.
ఇదిలా ఉంటే కొత్త సోనెట్‌కి సంబంధించి మరొక టీజర్‌ని కియ ఇండియా షేర్ చేసింది. ఇది కార్ డిజైన్, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్(ADAS)తో సహా ఇతర ఫీచర్ల వివరాలను అందిస్తోంది. వెనక భాగంలో LED టైల్లైట్లు రీడిజైన్ చేయబడ్డాయి. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఉన్న విధంగానే ఉంది. 
Also Read
- Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
- E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
Read Also: Revanth Reddy: క్రేజ్ మామూలుగా లేదు..! భీమవరంలో రేవంత్‌రెడ్డి, సీతక్క ఫ్లెక్సీ..
హ్యుందాయ్ వెన్యూలో ఉన్న విధంగానే కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లో ADAS సూట్ ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిషన్-ఎవాయిడెన్స్ అసిస్ట్ (కార్, పాదచారులు, సైకిల్), లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ మరియు లీడింగ్ వెహికల్ డిపార్చర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి ముందు మొదటి టీజర్లో న్యూ గ్రిల్, LED హెడ్లైట్లు, DRLలు, ఫాగ్ లైట్లు, రీడన్ బంపర్‌ని చూపించింది. కొత్తగా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా న్యూలుక్‌తో రాబోతోంది. అయితే 360 డిగ్రీ కెమెరా కూడా ఉండే అవకాశం ఉంది.
ఇంజన్, ధర వివరాలు:
యా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మూడు ఇంజన్ ఆప్షన్లను కొనసాగిస్తుంది. 83hp, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 120hp, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 116hp, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ కోసం 5-స్పీడ్ మాన్యువల్, టర్బో-పెట్రోల్ కోసం 6-స్పీడ్ ఐఎంటీ మరియు 6-స్పీడ్ డీసీటీ, డిజిల్ ఇంజిన్ కోసం 6-స్పీడ్ iMT మరియు 6-స్పీడ్ AT ట్రాన్స్మిషన్లు అందుబాటులో ఉన్నాయి. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 8 లక్షల నుండి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని అంచనా. డిసెంబర్ 14న కారును ఆవిష్కరిస్తుండగా.. జనవరి 2024లో లాంచ్ జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!