Maruti eVX vs Hyundai Creta EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో త్వరలో మార్కెట్లోకి రానున్న మారుతి eVX (Maruti eVX), హ్యుందాయ్ క్రెటా EV Hyundai Creta EV మోడళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. విశ్వసనీయత, సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాల్లో రెండు బ్రాండ్లకూ మంచి పేరు ఉండటంతో.. కొనుగోలుదారులు ఏది మంచి విలువ ఇస్తుందో అర్థం చేసుకోవడంలో గందరగోళానికి గురవుతున్నారు. కాబట్టి ఇప్పుడు రేంజ్, ఫీచర్లు, మొత్తం వాల్యూ ఫర్ మనీ పరంగా ఏ ఎలక్ట్రిక్ SUV బెస్ట్ చూద్దాం..
డిజైన్:
డిజైన్ విషయానికి వస్తే మారుతి eVX ఫ్యూచరిస్టిక్ టచ్‌తో కొంచెం బోల్డ్‌గా కనిపిస్తుంది. స్వల్పంగా కూపే స్టైల్ ప్రొఫైల్ ఉండటం వల్ల యువ కొనుగోలుదారులకు ఇది మరింత ఆకర్షణీయంగా అనిపిస్తుంది. మరోవైపు హ్యుందాయ్ క్రెటా EV తన ఐసీఈ వెర్షన్ డిజైన్‌ను ఆధారంగా చేసుకుని, ఇప్పటికే భారత రోడ్లపై గుర్తింపు పొందిన లుక్‌ను కొనసాగిస్తుంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్ కోరుకునేవారికి eVX కొత్తగా అనిపిస్తే, సేఫ్ & గుర్తింపు ఉన్న డిజైన్ కోరుకునేవారికి హ్యుందాయ్ క్రెటా EV సరైన ఎంపికగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ రేంజ్ & బ్యాటరీ:
ఎలక్ట్రిక్ వాహనాల్లో కొనుగోలుదారులకు అత్యంత కీలకమైన అంశం రేంజ్ లేదా మైలేజ్. Maruti eVX నగరంతో పాటు హైవే ప్రయాణాలకు సరిపడే మంచి రియల్ వరల్డ్ రేంజ్ ఇవ్వగలదని అంచనా. హ్యుందాయ్ క్రెటా EV కూడా మంచి రేంజ్ ఇవ్వనుంది. అయితే ఇది ఎక్కువగా స్మూత్ పవర్ డెలివరీ, ఎనర్జీ ఎఫిషియెన్సీపై దృష్టి పెట్టవచ్చు. నగర వినియోగానికి రెండు SUVs సరిపోతాయి. దీర్ఘ ప్రయాణాల విషయంలో మాత్రం చార్జింగ్ నెట్‌వర్క్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఫీచర్లు:
ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా కాస్త బెటర్ అని చెప్పవచ్చు. హ్యుందాయ్ క్రెటా EVలో ప్రీమియం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డిస్‌ప్లేలు, కనెక్టెడ్ టెక్ వంటి అధునాతన ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఇక మరోవైపు మారుతి eVX కూడా యూజర్-ఫ్రెండ్లీ డిజైన్‌తో పాటు అవసరమైన ఆధునిక ఫీచర్లను అందించనుంది. కంఫర్ట్ పరంగా రెండూ సమానంగా ఉన్నా, లగ్జరీ ఫీల్‌లో మాత్రం క్రెటా EV కొంచెం ముందుండే అవకాశం ఉంది.
Crime News: చెల్లిని “వాడుకుని”, అక్కతో సహజీవనం.. లైంగిక దోపిడి, రూ. 20 లక్షలు కాజేసిన వివాహితుడు..

తుది నిర్ణయం:
మారుతి eVX తక్కువ ఖర్చుతో ప్రాక్టికల్, సులభమైన ఓనర్‌షిప్ అనుభవం కోరుకునే వారికి సరైన ఎలక్ట్రిక్ SUV. ఇక మరోవైపు హ్యుందాయ్ క్రెటా EV మాత్రం ప్రీమియం ఫీచర్లు, స్మూత్ డ్రైవింగ్, మంచి డిజైన్‌ను ఇష్టపడే వినియోగదారులకు అనువైన ఎంపిక.