Mahindra XUV 7XO vs Toyota Innova Crysta: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో 7-సీటర్ కార్లకు ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రయాణాలకు టొయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) దశాబ్దాలుగా లీడింగ్ లో ఉంది. అయితే తాజాగా మహీంద్రా నుండి వచ్చిన కొత్త SUV కారు XUV700ని XUV 7XO పేరుతో సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది మీ కుటుంబానికి సరిపోతుంది? ఇలాంటి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం.
డిజైన్:
మహీంద్రా XUV 7XO చూడటానికి చాలా స్పోర్టీగా, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఉంటుంది. దీని వెడల్పు ఇన్నోవా కంటే ఎక్కువగా ఉండటం వల్ల లోపల కాస్త విశాలంగా అనిపిస్తుంది. మరోవైపు, ఇన్నోవా క్రిస్టా క్లాసిక్ MPV లుక్‌తో ఎక్కువ పొడవు, ఎత్తును కలిగి ఉంటుంది.

Maithili Thakur: ముంబైలో మైథిలి ఠాకూర్ ఎన్నికల ప్రచారం.. వెరైటీగా ఏం చేసిందంటే..!
ఇంటీరియర్, ఫీచర్లు:
XUV 7XO: ఇది ఫీచర్ల పరంగా ఇన్నోవా కంటే చాలా ముందుంది. ఇందులో మూడు 12.3 అంగుళాల డిస్‌ప్లేలు (ట్రిపుల్ స్క్రీన్), పనోరమిక్ సన్‌రూఫ్, 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మోస్, మరియు బిల్ట్-ఇన్ ChatGPT వంటి సరికొత్త టెక్నాలజీ ఉంది.
ఇన్నోవా క్రిస్టా: దీని ఇంటీరియర్ కొంత పాతకాలపు డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, నాణ్యత విషయంలో రాజీ పడదు. అలాగే ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రాథమిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది ముఖ్యంగా సౌకర్యం, మన్నిక (Reliability) కోసం ఇష్టపడే వారికి సరిపోతుంది.
Sankranti Pindi Vantalu: ఈ పండుగకు సింపుల్‌గా.. షార్ట్ టైంలో చేసుకునే 5 రకాల పిండి వంటలు ఇవే..
పనితీరు:
ఇక్కడ మహీంద్రా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. XUV 7XOలో 2.0-లీటర్ పెట్రోల్ (203 PS), 2.2 లీటర్ డీజిల్ (185 PS) ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభిస్తాయి. అలాగే టాప్ మోడల్స్‌లో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సదుపాయం కూడా ఉంది. అదే ఇన్నోవా క్రిస్టా లో కేవలం 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ (150 PS) తో మాత్రమే లభిస్తుంది. దీనికి కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే ఉంది, ఆటోమేటిక్ ఆప్షన్ లేదు.

భద్రత:
భద్రత విషయంలో రెండింటిలోనూ 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ESC వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే XUV 7XO లో అదనంగా లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఉండటం పెద్ద ప్లస్ పాయింట్.
ధర:
మహీంద్రా XUV 7XO కారు రూ.13.66 లక్షల నుండి రూ. 24.92 లక్షల వరకు ఉండగా.. మరోవైపు టొయోటా ఇన్నోవా క్రిస్టా రూ. 18.85 లక్షల నుండి రూ. 25.53 లక్షల వరకు ఉన్నాయి.
ఏది కొనాలి?
ఎవరైతే అధునాతన ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజన్, తక్కువ ధరలో ఎక్కువ వాల్యూ కోరుకుంటే మహీంద్రా XUV 7XO మంచి ఎంపిక. అలా కాకుండా మీకు ఇంజన్ నమ్మకం (Reliability), మెరుగైన రీసేల్ వాల్యూ, ఇంకా సుదీర్ఘ ప్రయాణాల్లో తిరుగులేని సౌకర్యం కావాలనుకుంటే టొయోటా ఇన్నోవా క్రిస్టా కొనవచ్చు.