Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఎలక్ట్రిక్ వాహన యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- దేశవ్యాప్తంగా భారీ ఛార్జింగ్ నెట్వర్క్ ఏర్పాటు..
- 4,874 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Vehicle: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల( EV) ట్రెండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ రేట్ల అనిశ్చితి మధ్య చాలా మంది వినియోగదారులు ఈవీల వైపు మళ్లుతున్నారు. భారత ఆటోమొబైల్ మార్కెట్లో EV వాటా 5.77 శాతానికి చేరింది. అయితే, ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, రేంజ్ తక్కువగా ఉండటం వల్ల దూర ప్రాంతాల ప్రయాణాలు కష్టంగా మారుతున్నాయి. ఈ తరుణంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు, రేంజ్, ఛార్జింగ్ సమస్యల్ని దూరం చేసేందుకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రకటించింది . ఈ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 4,874 ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.503.86 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ పీఎం ఇ-డ్రైవ్ పథకంలో భాగంగా తీసుకువస్తు్న్నారు.
Also Read
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
Read Also: US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్‌కు కష్టమేనా!
కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి మే 12న బెంగళూర్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈవీ వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత రేంజ్ అనేది వినియోగదారులకు ఆందోళనకర విషయంగా మారింది. దీనిని దూరం చేసేందుకే కేంద్రం ఈ చర్యను చేపట్టింది. ప్రజలు తమ వాహనాలను అవసరమైనప్పుడు ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఒక పటిష్టమైన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఈ ఛార్జింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, త్రీవీలర్, బస్సులు, భారీ ట్రక్కులను ఛార్జింగ్ చేసే సౌకర్యం ఉంటుంది. ప్లాన్ ప్రకారం ఈ ఛార్జింగ్ స్టేషన్లను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. వీటిలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయి. ఎక్కువగా కర్ణాటకలో ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 1243 ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు రూ. 123.66 ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్యాసింజర్ వాహన మార్కెట్లో ఈవీల వాటా 5.77 శాతంగా ఉంది. టూ వీలర్ వాహన విభాగంలో వీటి వాటా 7.76 శాతానికి చేరుకుంది. కమర్షియల్ వాహన విభాగంలో వీటి వాటా 2.26 శాతానికి చేరుకుంది.
తాజావార్తలు
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!