Hyundai Creta Sales 2025: ఈ ఏడాది అమ్మకాల్లో హ్యుందాయ్ క్రేటా సంచలనం.. గంటకు 23 కార్లు విక్రయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai Creta Sales 2025: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) మిడ్-సైజ్ SUV విభాగంలో కొత్త మైలురాయిని చేరుకుంది. 2025 ఏడాదిలో దాదాపు 2 లక్షల యూనిట్ల హ్యుందాయ్ క్రేటాలను విక్రయించింది. ఇది ఇప్పటివరకు ఈ సెగ్మెంట్‌లో ఏ SUV సాధించని అత్యధిక వార్షిక అమ్మకాల జాబితాలో చేరింది. అంటే రోజుకు సగటున 550 క్రెటా కార్లు, గంటకు సుమారు 23 కార్లు అమ్ముడయ్యాయి. దీంతో క్రెటా తన సెగ్మెంట్‌లో 34 శాతం కంటే ఎక్కువ మార్కెట్ షేర్‌ను నిలబెట్టుకుంది. 2020 నుంచి 2025 వరకూమొత్తం అమ్మకాల పరంగా భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా క్రెటా నిలిచింది.
READ MORE: Rajasthan: ఢిల్లీ ఎర్రకోట పేలుడు లాగే, కారులో పేలుడు పదార్థాలు స్వాధీనం..
Also Read
- Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
- Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
- Ola S1Z: భారత్‌లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
- Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్‌బ్యాగ్స్, 10.1″ టచ్‌స్క్రీన్.. ధర ఎంతంటే?
అంతే కాదు.. లాంచ్ అయ్యి పదేళ్లు పూర్తయిన సందర్భంగా క్రెటా మరో ఘనత సాధించింది. 2016 నుంచి 2025 మధ్య కాలంలో గట్టి పోటీ ఉన్నప్పటికీ.. 9 శాతం కంటే ఎక్కువ కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR)ను నమోదు చేసింది. ఈ కాలంలో మారుతి సుజుకి విక్టోరిస్, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్, స్కోడా కుషాక్ వంటి అనేక కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. వాదిని దాటుకుంటూ క్రెటా ఈ మైలురాయిని సాధించింది. ఇక ముందు రోజుల్లో రెనాల్ట్ డస్టర్ లాంటి కార్లు రావడంతో ఈ కారుకు పోటీ మరింత పెరగనుంది.
READ MORE: New Year 2026: యుద్ధాలు.. వాతావరణ విపత్తులు.. రోగాలు.. రెసెషన్..! 2026లో ఎలా ముందుకెళ్లాలి?
హ్యుందాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వినియోగదారుల అభిరుచుల్లో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 2020లో క్రెటాను కొనుగోలు దారుల్లో మొదటిసారి కారు కొనుగోలు చేసే వారి శాతం 13 మాత్రమే ఉండేది. కానీ.. 2025 నాటికి అది 32 శాతానికి పెరిగింది. అలాగే సన్‌రూఫ్ ఉన్న వేరియంట్ల మొత్తం అమ్మకాలలో 70 శాతం కంటే ఎక్కువ వాటాను క్రెటా కలిగి ఉంది. ఈ విజయంపై HMIL మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో డిజిగ్నేట్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా ప్రయాణం అసాధారణమైనదని అభివర్ణించారు. ఒకే సంవత్సరంలో 2 లక్షలకుపైగా యూనిట్ల అమ్మకాలు సాధించడం కంపెనీకి గర్వకారణమన్నారు. క్రెటా ప్రతి ప్రయాణికులకు నమ్మకంగా మారిందని, వినియోగదారులు, డీలర్ల మద్దుతుతోనే ఈ విజయం సాధించామని తెలిపారు.
READ MORE: Woman Gang-Ra*ped: కదులుతున్న కారులో మహిళపై సామూహిక అత్యాచారం.. 2 గంటల పాటు దారుణం..
కాగా.. క్రెటా మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఒకటి నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, రెండవది టర్బో పెట్రోల్, మూడవది డీజిల్. నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లకు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా వస్తుంది. ఆటోమేటిక్ కోరుకునే వారికి పెట్రోల్ ఇంజిన్‌తో IVT, డీజిల్ ఇంజిన్‌తో టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ అందుబాటులో ఉన్నాయి. టర్బో పెట్రోల్ ఇంజిన్ మాత్రం డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్‌తో మాత్రమే లభిస్తుంది. అలాగే క్రెటాలో ఎలక్ట్రిక్ వేరియంట్ ను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఇది 42 kWh, 51.4 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది. వరుసగా 420 కిలోమీటర్లు, 510 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!