Honda CB125 Hornet: భారతదేశంలో 25 ఏళ్ల ప్రయాణ మైలురాయిని అందుకున్న హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌కి రెండు కొత్త బైకులను విడుదల చేసింది. అవే Shine 100 DX, CB125 Hornet లు. జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం రూపొందించిన ఈ మోడళ్లలో కొత్త టెక్నాలజీ, ఆధునిక డిజైన్‌ను ఉపయోగించారు. ఈ రెండు బైకుల బుకింగ్స్ ఆగస్టు 1 నుండి మొదలు కానున్నాయి. ఈ బైక్స్ సంబంధించి ధర వివరాలు కూడా అప్పుడే వెల్లడికానున్నాయి. ఇక ఈ బైక్స్ డెలివరీలు దశలవారీగా జరుగనున్నాయి.
హోండా సిటీ యూత్‌ను లక్ష్యంగా పెట్టుకొని CB125 హార్నెట్ (CB125 Hornet) బైక్‌ను పరిచయం చేసింది. CB125 హార్నెట్ బైక్ 125cc బైక్‌గా అందుబాటులోకి రాబోతోంది. దీని డిజైన్ చాలా స్పోర్టీగా ఉంటుంది. ముందు భాగంలో ట్విన్ LED హెడ్ల్యాంప్, DRLs, హై మౌంటెడ్ LED ఇండికేటర్లతో స్టైల్ లుక్ కనపడుతుంది. వీటికి తోడుగా.. సైడ్ లో మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, షార్ప్ ట్యాంక్ శ్రౌడ్స్, స్లీక్ మఫ్లర్లు బైక్ ను మరింత ఆకర్షణీయంగా చేస్తున్నారు.
Honda Shine 100 DX: స్టైల్, మైలేజ్, సేఫ్టీల పక్కా ప్యాకేజీతో వచ్చేసిన కొత్త షైన్ 100 DX బైక్.!

ఇకపోతే, తొలిసారిగా ఈ సెగ్మెంట్‌లో గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్స్ ను తీసుకవచ్చింది హోండా. ఇవి రైడింగ్‌కి మెరుగైన కంట్రోల్‌ను ఇస్తాయి. 5-స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్‌తో రైడింగ్ అనుభవం సాఫీగా ఉంటుంది. ప్రత్యేకంగా ట్యాంక్ మీదే ఇగ్నిషన్ కీ ప్లేస్ చేసిన తీరు కొత్తగా ఉంది. స్ప్లిట్ సీట్లు, మల్టీ-స్పోక్ అలాయ్ వీల్స్ స్టైలిష్ లుక్‌ను కలిగిస్తాయి. ఈ బైక్ పర్ల్ సైరన్ బ్లూ విత్ లెమన్ ఐస్ యెలో, పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పర్ల్ సైరన్ బ్లూ విత్ అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, పర్ల్ సైరన్ బ్లూ విత్ స్పోర్ట్స్ రెడ్ వంటి నాలుగు రంగుల కాంబినేషన్‌లలో లభించనుంది.

ఈ కొత్త CB125 Hornetలో 4.2 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు హోండా RoadSync యాప్‌కు మద్దతు ఇస్తుంది. దీనితో టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు హ్యాండిల్ బార్ స్విచ్ లతోనే అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో, USB Type-C పోర్ట్ ద్వారా మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇక భద్రత పరంగా, ఇంజిన్ స్టాప్ స్విచ్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్ వంటి ముఖ్యమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి.

Indian Passport: భారతీయులకు శుభవార్త.. ఇకపై 59 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్!
ఈ బైక్ లో 123.94cc ఫ్యూయల్ ఇంజెక్టెడ్, OBD2B కంప్లయింట్ ఇంజన్ ఉంది. ఇది 8.2 kw శక్తిని, 11.2 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా 0 నుంచి 60 కిమీ వేగాన్ని కేవలం 5.4 సెకన్లలో చేరుతుంది. బైక్ బరువు 124 కిలోలే కావడంతో హ్యాండ్లింగ్ చాలా సులువుగా ఉండనుంది. ఇక CB125 హార్నెట్ బైక్ ముందు భాగంలో 240mm డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130mm డ్రమ్ బ్రేక్ అందించబడింది. వీటికి సింగిల్ చానల్ ABS సపోర్ట్‌తో మరింత సురక్షితంగా ఉండనుంది. వైడ్ ట్యూబ్ లెస్ టైర్లు పట్టుదలతో పాటు స్టేబిలిటీని మెరుగుపరుస్తాయి. మొత్తంగా చెప్పాలంటే.. హోండా CB125 Hornet యువత కోసం స్పోర్టీ స్టైలిష్ ప్యాకేజీగా హోండా ప్రవేశపెట్టింది.
