హీరో మోటోకార్ప్ తన ప్రముఖ మోటార్‌సైకిల్ ప్యాషన్ ప్లస్‌ను తాజాగా విడుదల చేసింది. ఇప్పుడు అప్‌డేట్ చేయబడిన హీరో ప్యాషన్ ప్లస్ బైక్ ఎన్నో అంచనాల మధ్య మార్కెట్‌లోకి ప్రవేశించింది. దాదాపు 4సంవత్సరాల తర్వాత హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌ను మళ్లీ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. దీని ధరను రూ.81,651 (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది.
READ MORE: Dio 2025 Launche: స్మార్ట్ కీ, యాప్ కనెక్టివిటీతో సరికొత్త “డియో స్కూటర్” విడుదల..
కొత్త ప్యాషన్ ప్లస్‌లో 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్‌కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 8 హెచ్‌పీ పవర్‌ను, 8.05 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4 స్పీడ్ గేర్‌బాక్స్ వెల్ మల్టీ ప్లేట్ క్లచ్‌తో వస్తోంది. స్ప్లెండర్, హెచ్‌ఎఫ్ డీలక్స్ మోడళ్లలో కూడా ఇదే ఇంజిన్‌ను అమర్చారు. బ్లాక్ నెక్సస్ బ్లూ, బ్లాక్ హెవీ గ్రే రంగుల్లో లభిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే.. డిజిటల్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తోంది. ఐడల్ స్టాప్- స్టార్ట్ సిస్టమ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇండికేటర్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆప్షన్లతో వస్తోంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనకవైపు ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. ముందూ, వెనక డ్రమ్ బ్రేకులు, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తోంది. గతేడాది మోడల్‌తో పోలిస్తే ఆధునికీకరించిన మోడల్ ధర దాదాపు రూ.1750 మేర అధికంగా ఉంది.
READ MORE: Dio 2025 Launche: స్మార్ట్ కీ, యాప్ కనెక్టివిటీతో సరికొత్త “డియో స్కూటర్” విడుదల..
ఫ్యామిలీ బైక్..
హీరో ప్యాషన్ ప్లస్ మంచి మైలేజ్‌తో పాటు ఫ్యామిలీ బైక్ పేరుతెచ్చుకున్న హీరో మోడల్ బైక్‌లలో ప్యాషన్ ప్లస్ కూడా ఒకటి. 2001లో ప్యాషన్ ప్లస్ బైక్‌ను ఇండియాలోకి తీసుకొచ్చింది హీరో మోటోకార్ప్. అనేక ఏళ్ల పాటు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. ఈ మోడల్‌ను సంస్థ తయారు చేయడం ఆపడంతో ప్యాషన్ ప్లస్‌కు మాత్రం కాస్త బ్రేక్ వచ్చింది.. ఇప్పుడు తన పోర్ట్‌ఫోలియోను పెంచుకోవాలని చూస్తున్న హీరోమోటో కార్ప్.. కొత్త కొత్త మోడల్స్‌తో పాటు పాత వాటిని తిరిగి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ప్యాషన్ ప్లస్ ఇండియాలోకి తిరిగి అడుగుపెట్టింది.