Bharat Mobility Global Expo 2025: హీరో డబుల్ బ్లాస్ట్! రెండు శక్తివంతమైన స్కూటర్లు విడుదల..
- అద్భుతమైన స్కూటర్లను విడుదల చేసిన హీరో
- Xoom 160, Xoom 125గా పేర్లు
- ఫీచర్స్, ధర పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో మోటోకార్ప్ తన రెండు అద్భుతమైన స్కూటర్లు Xoom 160, Xoom 125లను భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్లు వాటి ఆకర్శణీయమైన డిజైన్‌తో పాటు శక్తి వంతమైన ఫీచర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. Xoom 125 ధర రూ. 86,900 (ఎక్స్-షోరూమ్), Xoom 160 ధర రూ. 1.48 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ధారించింది. ఈ రెండు స్కూటర్లు హీరో ప్రస్తుత పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తాయని అభిప్రాయం. వాటి ప్రత్యేకతలను వివరంగా తెలుసుకుందాం..
Xoom 125 డిజైన్ , లుక్స్
హీరో జూమ్ 125 డిజైన్ సాధారణ స్కూటర్లకు పూర్తి భిన్నంగా ఉంది. ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ లైట్లు, టెయిల్ సెక్షన్‌తో కూడిన షార్ప్ ఫ్రంట్ ఆప్రాన్ దీనికి స్పోర్టీ అప్పీల్‌ని ఇస్తుంది. Xoom 125.. 125cc ఇంజిన్‌ను కలిగి ఉంది. 14-అంగుళాల టైర్లు అమర్చారు. ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఆల్-LED లైట్లు, స్క్రోల్-స్టైల్ టర్న్ ఇండికేటర్లను కలిగి ఉంది. ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. మంచి మైలేజ్ అందిస్తుంది. ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్ కలిగి ఉంది.
Also Read
- BMW Vision K18: భవిష్యత్ హై-పర్ఫార్మెన్స్ టూరింగ్ బైక్.. బీఎండబ్ల్యూ విజన్ K18 ఆవిష్కరణ
- Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
- Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
- Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
హీరో Xoom 160 డిజైన్ – ఫీచర్లు..
హీరో Xoom 160 అనేది బ్రాండ్ యొక్క మొదటి మ్యాక్సీ-స్కూటర్. ఇది అడ్వెంచర్ బైక్ డిజైన్‌ను పోలి ఉంది. దీని ఫ్రంట్ ప్రొఫైల్‌లో ఆకర్షణీయమైన స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్లైట్లు అమర్చారు. దీని బాడీ అడ్వెంచర్ స్కూటర్‌గా గుర్తింపునిస్తుంది. Xoom 160లో 156cc సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 8,000rpm వద్ద 14bhp శక్తిని, 6,500rpm వద్ద 13.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది CVT గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా స్కూటర్లో ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇది 14-అంగుళాల చక్రాలు, ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. దీని బ్రేకింగ్ హార్డ్‌వేర్ చాలా బలంగా ఉన్నట్లు చెబుతున్నారు. కాగా.. Xoom 125, Xoom 160 లాంచ్‌తో ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్లో కూడా తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు హీరో చూపించింది. రూ. 86,900 (Xoom 125), రూ. 1.48 లక్షల (Xoom 160) ధరలతో ప్రారంభమయ్యే ఈ స్కూటర్లు డిజైన్, పనితీరు, ఫీచర్లు కస్టమర్లను ఆకర్శిస్తాయని కంపెనీ పేర్కొంది.
తాజావార్తలు
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!