DSR Group: మాజీ ఎంపీ ఇల్లు సహా పలు కంపెనీల్లో ఐటీ సోదాలు.. లిక్కర్ స్కాం దిశగా దర్యాప్తు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DSR Group: హైదరాబాద్‌లో ఐటీ శాఖ విస్తృత స్థాయిలో సోదాలు కొనసాగిస్తోంది. 24 గంటలుగా ఆరు కంపెనీల్లో, అలాగే మాజీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. డీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, డీఎస్‌ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, డీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, డీఎస్‌ఆర్ ప్రైమ్ స్పేస్ వంటి సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన ఆస్తులతో పాటు వ్యక్తిగత ఆస్తులపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఈ దాడుల నేపథ్యంలో అధికారులు భారీ మొత్తంలో పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కంపెనీ అధినేతల బ్యాంకు లాకర్లు కూడా గుర్తించారు. ఇవి ఈరోజు తెరవనున్నట్లు సమాచారం.
World Cup 2025: ప్రపంచకప్ జట్టులో ఇద్దరు తెలుగు ప్లేయర్స్.. భారత జట్టు ఇదే!
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో లింక్ ఉన్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, శ్రీనివాస ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మాజీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలోనూ సోదాలు దాదాపు 25 గంటలుగా కొనసాగుతున్నాయి. నిన్న తెల్లవారుజామునే నాలుగు ఐటీ టీమ్స్ ఆయన ఇంటికి చేరుకుని తనిఖీలు ప్రారంభించాయి. అర్ధరాత్రి వరకు కూడా సోదాలు కొనసాగించగా, ప్రస్తుతం ఒక టీమ్ ఇంకా తనిఖీలు చేస్తోంది.
Bollywood : కథ బాగున్నా ప్రమోషన్స్ లేక ప్లాప్ అవుతున్న సినిమాలు
రంజిత్ రెడ్డి డీఎస్‌ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పార్టనర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ఇళ్ళు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యుల బ్యాంకు లాకర్లు కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ సోదాలు లిక్కర్ స్కాం దిశగా మరిన్ని ఆధారాలను వెలికితీయనున్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..