Operation Ganga: ప్రధాని మోడీ కీలక భేటీ.. ఉక్రెయిన్ బోర్డర్ దేశాలకు కేంద్ర మంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఓవైపు చర్చలు.. మరో వైపు యుద్ధం ఇలా.. రెండూ సాగుతున్నాయి.. మరోవైపు ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం.. ఉక్రెయిన్‌లో ఇంకా 15 వేల మంది భారతీయులు చిక్కుకున్నారు.. వారంతా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు తరలివస్తున్నారు.. దాడులు జరుగుతుండడంతో భయపడిపోతున్నారు.. పోలండ్‌లో భారతీయులపై అక్కడి స్థానిక పోలీసులు దాడులు చేశారు.. దీంతో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు మంత్రులను పంపాలని భావిస్తోంది కేంద్రం. ఉక్రెయిన్ సంక్షోభంపై ఇవాళ ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరి, స్లోవక్ రిపబ్లిక్, పోలాండ్‌కు కేంద్ర మంత్రులను పంపించాలని నిర్ణయం తీసుకున్నారు.
Read Also: YS Viveka Murder Case: సీబీఐ వాంగ్మూలం.. సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Also Read
- 7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
- TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్‌లకు గట్టి పోటీ
- Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
రొమేనియా, హంగేరి, స్లోవక్ రిపబ్లిక్, పోలాండ్‌కు కేంద్ర మంత్రులు హరిదీప్ సింగ్ పురి, జ్యోతిరాదిత్య సింథియా, కిరణ్ రిజిజు, వీకే సింగ్‌ను పంపించనుంది కేంద్ర ప్రభుత్వం.. ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఆపరేషన్ గంగాను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం.. భారతీయ విద్యార్థులను తీసుకువచ్చే కార్యక్రమాలను వేగవంతం చేసింది.. కాగా, ఉక్రెయిన్‌లో ఇంకా దాదాపు 15వేల మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బంకర్లు, బాంబు షెల్టర్లు, హాస్టల్ బేస్మెంట్లలో వాళ్లంతా తలదాచుకుంటున్నారు. గత గురువారం రష్యా దాడులు ప్రారంభించడానికి ముందు కొంత మంది విద్యార్థులు ఉక్రెయిన్ వీడి వచ్చారు. ఇక, అక్కడ చిక్కుకున్నవారి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.. ఇప్పటికే ఐదు విమానాలు భారత్‌కు చేరుకున్నాయి.. అక్కడి నుంచి సొంత రాష్ట్రాలకు విద్యార్థులను తరలించే ప్రక్రియను చేపట్టాయి ఆయా రాష్ట్రాలు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!