999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMW M 1000 RR: BMW Motorrad భారత మార్కెట్లో అప్డేటెడ్ M 1000 RR సూపర్‌బైక్‌ను విడుదల చేసింది. పూర్తిగా విదేశాల్లో తయారైన CBU మోడల్‌గా అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ బుకింగ్స్‌ను దేశవ్యాప్తంగా BMW Motorrad డీలర్‌షిప్‌లలో ప్రారంభించింది. ఇండియా స్పెక్ మోడల్లో M Competition Packageను స్టాండర్డ్‌గా అందిస్తోంది. Blackstorm Metallic కలర్‌తో పాటు BMW M రంగుల గ్రాఫిక్స్‌లో లభిస్తుంది. ఈ కొత్త మోడల్లో ఇంజిన్ పవర్, ఏరోడైనమిక్స్, ఛాసిస్‌తో పాటు ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌ను అప్డేట్ చేశారు.
ఈ కొత్త BMW M 1000 RRలో 999cc ఇన్లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 14,500 rpm వద్ద 218 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. గత మోడల్‌తో పోలిస్తే 6 hp పవర్ పెరిగింది. 11,100 rpm వద్ద 113 nm గరిష్ఠ టార్క్‌ను అందిస్తుంది. ఈ సూపర్‌బైక్ గరిష్ఠ వేగం గంటకు 300 కి.మీ.కు పైగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇంజిన్‌లో భాగంగా సిలిండర్ హెడ్ పోర్ట్ డిజైన్, కంబషన్ ఛాంబర్ ఆకృతిని మార్చారు. ఫుల్-షాఫ్ట్ టైటానియం వాల్వ్స్తో పాటు ఇన్‌టేక్, ఎగ్జాస్ట్ వాల్వ్ జ్యామితిలో మార్పులు చేశారు. టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కూడా అప్డేట్ చేశారు. ఇందులో కొత్త సిలిండర్ హెడ్ ఫ్లాంజ్లు, ఓవల్ హెడర్ ఇన్లెట్స్, మార్పులు చేసిన ప్రీ-సైలెన్సర్ ఉన్నాయి.
Also Read
- కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
- Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
- Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
- Suzuki Ignis EV: Suzuki Ignis EV ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. 26kWh బ్యాటరీ, 90bhp పవర్, పూర్తి వివరాలు ఇవే!
BMW ShiftCam టెక్నాలజీ, యాంటీ-హాపింగ్ క్లచ్, గేర్ షిఫ్ట్ అసిస్టెంట్ ప్రో వంటి ఫీచర్లు ఉన్నాయి. కొత్త M షార్ట్-స్ట్రోక్ థ్రోటిల్కు కేవలం 58 డిగ్రీల రొటేషన్ సరిపోతుంది. దీంతో రైడర్లు తక్కువ మణికట్టు కదలికతోనే ఫుల్ థ్రోటిల్‌ను పొందవచ్చు. ఈ బైక్ అన్లాడెన్ బరువు 194 కిలోలు. సీట్ ఎత్తు 865 మి.మీ., వీల్‌బేస్ 1,458 మి.మీ.గా ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 16.5 లీటర్లు కాగా, ఇందులో సుమారు 4 లీటర్ల రిజర్వ్ ఉంటుంది. ముందు 120/70 R17, వెనుక 200/55 R17 టైర్లను అందించారు. కొత్త M 1000 RRలో రీడిజైన్ చేసిన ఫ్రంట్ ఫెయిరింగ్‌తో పాటు M వింగ్లెట్స్ 3.0ను అందించారు. కార్బన్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్‌తో తయారైన ఈ వింగ్లెట్స్ అధిక డౌన్‌ఫోర్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో వేగాన్ని పెంచే సమయంలో బైక్‌కు మెరుగైన గ్రిప్, స్థిరత్వం లభిస్తాయని BMW చెబుతోంది.
ఛాసిస్లోనూ మార్పులు చేశారు. ఎడమవైపు కొత్త ఇంజిన్ మౌంట్‌ను అమర్చడంతో పాటు స్టీరింగ్ హెడ్ చుట్టూ ఫ్లెక్స్ లక్షణాలను మార్చారు. రేస్ట్రాక్పై మెరుగైన హ్యాండ్లింగ్, కంట్రోల్ అందించడమే ఈ మార్పుల లక్ష్యం. డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ లో ఇప్పుడు స్లయిడ్ కంట్రోల్ ఫీచర్‌ను చేర్చారు. స్టీరింగ్ యాంగిల్ సెన్సార్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ స్లిప్ కంట్రోల్, స్లయిడ్ కంట్రోల్‌గా విభజించబడుతుంది. రేస్ట్రాక్పై నియంత్రిత యాక్సిలరేషన్ డ్రిఫ్ట్ల సమయంలో రైడర్‌కు సహాయపడుతుంది.
ఈ బైక్‌లో కాంపిటీషన్ ప్యాకేజీ ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. ఇందులో కార్బన్ వీల్స్, కార్బన్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సాధారణ ఫుట్‌రెస్ట్ సిస్టమ్‌తో పోలిస్తే 220 గ్రాముల బరువు తక్కువగా ఉండే M ఫుట్‌రెస్ట్ సిస్టమ్‌ను కూడా అందించారు. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే కలర్ TFT డిస్ప్లే, కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ గ్రిప్స్, USB పోర్ట్ ఉన్నాయి. అడ్జస్టబుల్ క్లచ్, ఫ్రంట్ బ్రేక్ లివర్స్, LED లైటింగ్, ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్, తేలికైన M బ్యాటరీ, తొలగించగల నంబర్ ప్లేట్ హోల్డర్‌ను కూడా అందించారు.
తాజావార్తలు
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
-
Vedant Sehwag: పెద్దోడు డేంజర్.. చిన్నోడు మహా డేంజర్.. 7 వికెట్లతో చెలరేగిన సెహ్వాగ్ చిన్న కుమారుడు..
-
Drought: కరువు భారతం.. తెలుగురాష్ట్రాల్లో మరింత ఘోరం!
-
DMK MLA: తమిళనాడులో మరో ఎమ్మెల్యేపై మహిళా అధికారిణి వేధింపుల ఆరోపణలు.. ఎఫ్ఐఆర్ నమోదు!
ట్రెండింగ్
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!