Ather 450 Apex: ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారు Ather Energy భారత మార్కెట్‌లో 450 ఏపెక్స్ (Apex) ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్తగా క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ను 450 సిరీస్‌లోని అన్ని మోడళ్లలో (450 S, 450 X, 450 Apex) తీసుకవచ్చారు. అంతేకాకుండా, MY2025 వెర్షన్ యజమానులకు కూడా బ్యాక్‌వర్డ్ అప్‌డేట్ రూపంలో ఈ ఫీచర్ అందించనున్నారు. ఈ ప్రకటనను Ather Community Day వేడుకల సందర్భంగా సంస్థ వెల్లడించింది.
Perni Nani : సుగాలి ప్రీతి కేసుపై పవన్ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించిన పెర్ని నాని
ఇక Infinite Cruise పేరుతో వచ్చిన ఈ క్రూజ్ కంట్రోల్ ఫీచర్, హ్యాండిల్ బార్ కుడి వైపు ఉన్న స్విచ్ ద్వారా నియంత్రించబడుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. అన్ని స్పీడ్ రేంజ్‌లలో పనిచేస్తుంది. కనీస పరిమితి 10 kmph గా నిర్ణయించారు. ముఖ్యంగా, ట్రాఫిక్‌లో ఆగి మళ్లీ కదిలే పరిస్థితుల్లో కూడా ఇది పూర్తిగా ఆగిపోదు. దీనికి బదులుగా కొద్దిసేపు పాజ్ అయ్యి, స్కూటర్ మళ్లీ స్పీడ్ అందుకున్న వెంటనే కొనసాగుతుంది.
ఇంకా, ఈ క్రూజ్ కంట్రోల్ సహాయంతో హిల్ కంట్రోల్ (అప్‌హిల్, డౌన్‌హిల్ సపోర్ట్) కూడా వస్తుంది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కలిపి, క్రాల్ కంట్రోల్ కూడా అందిస్తున్నారు. దీని వల్ల ఆఫ్-రోడ్ పరిస్థితుల్లో కూడా 10 kmph వేగంతో సులభంగా నడపవచ్చు. ఈ ఫీచర్లన్నీ రోజువారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి తీసుకవచ్చారు. ఇతర ఫీచర్లలో మార్పులేమీ లేవు. ఇప్పటివరకు ఉన్నట్లుగానే 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డిస్ప్లే, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, ట్రాక్షన్ కంట్రోల్, మాజిక్ ట్విస్ట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. డిజైన్ పరంగా కూడా ఏ మార్పులు లేకుండా, అదే అగ్రెసివ్ లుక్ కొనసాగుతోంది.
పవర్ పరంగా చూస్తే.. ఎథర్ 450 ఏపెక్స్‌లో 7.0 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది 26 Nm పీక్ టార్క్ ఇస్తుంది. దీనికి జతగా 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే, ఈ స్కూటర్ 157 km వరకు రేంజ్ ఇస్తుంది. బ్యాటరీని 0 నుంచి 100% వరకు చార్జ్ చేయడానికి సుమారు 5 గంటలు 45 నిమిషాలు పడుతుంది. దీని ధరను రూ.1,90,825 (ఎక్స్ – షోరూమ్)గా న నిర్ణయించారు.