దేశంలోనే అతిపెద్ద బైక్ అవార్డును ఏప్రిలియా ఆర్ఎస్ 457 గెలుచుకుంది. ఈ బైక్ ‘ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2025’ (IMOTY) అవార్డును గెలుచుకుంది. ఈ బైక్ హీరో, రాయల్ ఎన్‌ఫీల్డ్, బజాజ్‌లను వెక్కి నెట్టేసింది. ఇది ఒక ఇటాలియన్ ఆటోమొబైల్ కంపెనీ కావడం గమనార్హం.
READ MORE: Pawan Kalyan: బుక్ ఫెస్టివల్‌లో ముఖ్యమైన పుస్తకాలు కొన్న పవన్.. బిల్లు ఎంతయిదంటే..?
పియాజియో ఇండియా సంస్థ తమ ఫ్లాగ్ షిప్ మోడల్ బైక్ అప్రీలియా ఆర్ఎస్ 457 ను 2023లో లాంచ్ చేసింది. ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 4.10 లక్షలుగా నిర్ణయించింది. దీన్ని కేవలం అప్రీలియాకు చెందిన మోటోప్లెక్స్ డీలర్ షిప్ ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్రీలియా ఆర్ఎస్ 457 బైక్ బుకింగ్స్ 2023 డిసెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ బైక్‌లో ఇందులో ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. ఇది పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ బైక్.కాబట్టి ఫుల్ ఫెయిరింగ్, క్లిప్-ఆన్‌ల సెట్, వెనుక సెట్ ఫుట్‌పెగ్స్ ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్ చాలా ప్రీమియం లుక్ తో కనిపిస్తోంది.
READ MORE:MG Windsor EV: దేశంలోని నంబర్-1 ఎలక్ట్రిక్ కారు.. ఇండియన్ గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 విజేత..
అప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ ఫీచర్స్..
అప్రిలియా RS 457లో రైడ్-బై-వైర్ థ్రాటిల్, LED లైటింగ్, మూడు స్థాయిల రైడింగ్ మోడ్‌లు, మూడు స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్ సెట్టింగ్‌లు ఉన్నాయి. అలాగే, ఇందులో 5-అంగుళాల TFT స్క్రీన్ కూడా ఉంది, ఇది రైడర్‌కు అన్ని ముఖ్యమైన సమాచారాలను చూపుతుంది. ఈ బైక్ ను ఇటలీలో డిజైన్ చేశారు. దీనిని భారతదేశంలోని బారామతిలో ఉన్న పియాజియో ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. అప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ లో సరికొత్త 457 cc, లిక్విడ్-కూల్డ్, DOHC, ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ని అమర్చారు. ఇది 47 bhp, 46 Nm గరిష్ట టార్క్‌ను అందించగలదు. ఇందులో 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉంది. ఈ మోటార్‌సైకిల్‌కు ట్విన్-స్పార్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంది. ముందు భాగంలో అప్-సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్స్ అమర్చారు. ఈ బైక్‌లో ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.