Telecom tariffs: రిలయన్స్ జియో యూజర్లు షాక్ ఇస్తూ టారిఫ్ రేట్లను పెంచింది. జూలై 3 నుంచి పెరిగిన రేట్లు అమలులోకి వస్తాయని చెప్పింది. జియో కొత్త అపరిమిత ప్లాన్ల ప్రకటన తర్వాత ఎయిర్టెల్, వొడఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైనట్లు సమచారం.
Amartya Sen: లోక్‌సభ ఎన్నికలపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ హిందూదేశం కాదని ఇటీవల లోక్‌సభ ఎన్నికలు నిరూపించాయని అన్నారు.
Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూపై చేతబడి చేసినందుకు ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పర్యావరణ మంత్రిత్వ శాఖలో స్టేట్ మినిష్టర్ ఉన్న షమ్నాజ్ సలీమ్, ప్రెసిడెంట్ కార్యాలయంలో మంత్రిగా పనిచేస్తున్న ఆమె మాజీ భర్త ఆడమ్ రమీజ్ మరియు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
Finger ice cream: ఇటీవల ముంబైలో ఓ డాక్టర్ ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు రావడం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఐస్‌క్రీం కోన్‌లో తెగిన వేలు కనిపించింది. ఈ విషయం పెద్ద ఎత్తున వైరల్ కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. వేలు ఎవరిదో కనుక్కునేందుకు దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు.
Vande Bharat Express: సెమీ హైస్పీడ్ రైళ్ల వేగాన్ని తగ్గిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే వరకు వందేభారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని 160 కి.మీ నుంచి 130 కి.మీకి తగ్గించారు.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ నివాసంపై దుండగులు దాడి చేశారు. గురువారం తన ఇంటిపై దాడి దాడి జరిగినట్లు ఓవైసీ ఆరోపించారు. గుర్తుతెలియని దుండగులు నల్ల ఇంకుతో ధ్వంసం చేశారని చెప్పాడు.
HIV-positive: ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల పోలీసులకు, ఇతర అధికారులకు కొత్త కష్టం వచ్చిపడింది. యువకులను మోసం చేస్తూ పదుల సంఖ్యలో వివాహాలు చేసుకుంటున్న ఓ ‘‘నిత్య పెళ్లికూతురి’’ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదులో మహిళను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు
Sudipa Chatterjee: బంగ్లాదేశ్ కుకింగ్ షోలో పాల్గొన్న బెంగాలీ నటి సుదీపా ఛటర్జీ వివాదంలో ఇరుక్కుంది. షోలో యాంకరింగ్ చేస్తున్న సమయంలో ఒక పార్టిసిపెంట్ ‘‘బీఫ్’’ వంటకాన్ని తయారు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. బీఫ్ వంటకాన్ని తయారు చేసిన పార్టిసిపేటెంట్తో ఇంటరాక్ట్ కావడంతో కొందరికి నచ్చలేదు.
Dushyant Chautala: హర్యానాలో బీజేపీ పొత్తు నుంచి విడిపోయాక, జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాలా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని గురువారం చెప్పారు.
INDIA bloc: పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాల గురించి ఇండియా కూటమి ఈ రోజు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయింది. ఈ సమావేశానికి కూటమిలోని పలువురు నేతలు హాజరయ్యారు.