బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్థాన్ యువకుడి రాసలీలలు వెలుగుచూశాయి. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా కీర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పాకిస్థాన్ యువకుడు ఫహద్. హిందూ అమ్మాయిని మతం మార్చి 2016 లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కీర్తి పేరును దోహా ఫాతిమా గా మార్చాడు. ఆ తర్వాత సిపాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో పాకిస్థాన్ యువకుడు ఫహద్ అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో భర్తపై నిగా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
Also Read:Off The Record: అటవీ అధికారులు మా పాత బాస్ సంక్షేమమే ముఖ్యమంటున్నారా?
భార్య దోహా ఫాతిమా పోలీసులకు సమాచారం ఇచ్చి భర్తను మరో మహిళను పట్టించింది. భార్య వెళ్లి చూసేసరికి నగ్నంగా కనిపించారు ఫహద్, మరో మహిళ. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. కాగా 1998లో పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డాడు ఫహద్. అమ్మాయిల మతం కన్వర్ట్ చేసి ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫహద్ పూర్వ వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.