ప్రేమ కోసం ప్రాణాలు తీయడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రామచంద్రపురం పి యస్ పరిధిలోని బండ్లగూడ బాలాజీనగర్ లో చోటుచేసుకుంది. చనిపోయిన యువతిని రమ్యగా గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రియుడు ప్రవీణ్ ను ఆస్పత్రికి తరలించారు. Also Read:Hacking: ఇది […]
దశాబ్దాల క్రితం.. యుక్తవయసులో చేసిన నేరాలు అతడిని వెంటాడాయి. ఓ ప్రమాదంలో పెద్ద కుమారుడు చనిపోగా.. చిన్న కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబం కూడా వరుస సమస్యలతో సతమతమవుతోంది. ఈ క్రమంలో మానసిక సంఘర్షణకు గురైన అతడు.. దాదాపు నలభై ఏళ్ల క్రితం రెండు హత్యలు చేశానంటూ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆ రహస్యాన్ని దాచిపెట్టి బతకడం ఇక తన వల్ల కావడం లేదని, అపరాద భారాన్ని మోయలేకపోతున్నానని చెప్పాడు. Also Read:Allu Arjun : తెలుగువారంటే […]
తమిళనాడులోని విరుదునగర్‌లోని బాణసంచా కర్మాగారంలో ఆదివారం పేలుడు సంభవించింది. విరుదునగర్ జిల్లాలోని సత్తూరు సమీపంలోని హిందుస్థాన్ క్రాకర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని యాబై గదుల్లో 15 గదులు ఫూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్యాక్టరీ లో పదుల సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిని శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఘటనా స్థలి […]
తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. రాజమండ్రిలోని మెడికల్ షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా నిషేధిత మందులు విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు గుర్తించారు. నిషేధిత మందులు ఎమ్మార్పి కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. వయాగ్రా ట్యాబ్లెట్స్, అబార్షన్ కిట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు గుర్తించారు. Also Read:Vaibhav Suryavanshi: 50 ఓవర్లు ఆడుతా, […]
భారత 50వ ప్రధాన న్యాయమూర్తి (CJI) అయిన DY చంద్రచూడ్ పదవీ విరమణ చేసి 8 నెలలు అయింది. కానీ ఆయన ఇంకా తన ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మాజీ సీజేఐని వీలైనంత త్వరగా బంగ్లాను ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో, డివై చంద్రచూడ్ బంగ్లాను ఖాళీ చేయడానికి గల కారణాన్ని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు జూలై 1న గృహనిర్మాణం, […]
ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పిస్తూ.. కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చుదిద్దుతోంది ఏపీ ప్రభుత్వం. అయితే కొందరు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తూ అక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుందని భావిస్తున్నారు. ఇలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ఆదర్శంగా నిలిచారు. టీచర్ల చొరవపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశాడు. Also Read:Love: వరుసకు అన్నాచెల్లెళ్ళు.. అయినా […]
ఆ యువతికి రెండేళ్ల క్రితమే పెళ్లైంది. భర్తను విడిచిపెట్టి తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ క్రమంలో వరుసకు అన్న అయే వ్యక్తితో ప్రేమలో పడింది. చివరకు ఇరుకుటుంబాల్లో వీరి వ్యవహారం తెలిసిపోయింది. ఏడాదిగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నా వరుసకు అన్నాచెల్లెళ్లు కావటంతో పెళ్లికి ఒప్పుకోలేదు తల్లిదండ్రులు. దీంతో ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలో చోటుచేసుకుంది. మృతి చెందిన ప్రేమికులది నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరంగా గుర్తించారు. […]
వాల్నట్లను “బ్రెయిన్ ఫుడ్” అని కూడా పిలుస్తారు. వాటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు (విటమిన్ E, B6 వంటివి), ఖనిజాలు, మెగ్నీషియం, రాగి, కాల్షియం, భాస్వరం, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే అవి మన శరీరంలోని అనేక భాగాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాల్ నట్స్ ను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు కలుగుతాయటున్నారు నిపుణులు. నానాబెట్టిన వాల్ నట్స్ ను ఉదయంపూట తింటే పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. Also Read:Boat […]
అమెరికాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. టెక్సాస్ వరదలతో వణుకుతోంది. ఆకస్మిక వరదల కారణంగా, గ్వాడాలుపే నది దాదాపు 45 నిమిషాల్లో 26 అడుగులు పెరిగి ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా, తొమ్మిది మంది పిల్లలు సహా 43 మంది మరణించారు. అదే సమయంలో, వేసవి శిబిరం నుంచి 23 మంది బాలికలు సహా 27 మంది గల్లంతయ్యారు. తుఫాను సెంట్రల్ టెక్సాస్ మీదుగా కదులుతున్నందున మరిన్ని భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ వెదర్ […]
ఇటీవల శంకర్ పల్లిలో ఓ యువతి రైల్వే ట్రాక్ పై కారు నడిపి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేయడంతో రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్ లో చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఆటోను రైల్వే ట్రాక్ పైకి తీసుకొచ్చి నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. బీహార్‌లోని సీతామర్హి-దర్భంగా […]