ఆ యువతికి రెండేళ్ల క్రితమే పెళ్లైంది. భర్తను విడిచిపెట్టి తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ క్రమంలో వరుసకు అన్న అయే వ్యక్తితో ప్రేమలో పడింది. చివరకు ఇరుకుటుంబాల్లో వీరి వ్యవహారం తెలిసిపోయింది. ఏడాదిగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నా వరుసకు అన్నాచెల్లెళ్లు కావటంతో పెళ్లికి ఒప్పుకోలేదు తల్లిదండ్రులు. దీంతో ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలో చోటుచేసుకుంది. మృతి చెందిన ప్రేమికులది నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరంగా గుర్తించారు. […]
వాల్నట్లను “బ్రెయిన్ ఫుడ్” అని కూడా పిలుస్తారు. వాటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు (విటమిన్ E, B6 వంటివి), ఖనిజాలు, మెగ్నీషియం, రాగి, కాల్షియం, భాస్వరం, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే అవి మన శరీరంలోని అనేక భాగాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాల్ నట్స్ ను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు కలుగుతాయటున్నారు నిపుణులు. నానాబెట్టిన వాల్ నట్స్ ను ఉదయంపూట తింటే పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. Also Read:Boat […]
అమెరికాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. టెక్సాస్ వరదలతో వణుకుతోంది. ఆకస్మిక వరదల కారణంగా, గ్వాడాలుపే నది దాదాపు 45 నిమిషాల్లో 26 అడుగులు పెరిగి ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా, తొమ్మిది మంది పిల్లలు సహా 43 మంది మరణించారు. అదే సమయంలో, వేసవి శిబిరం నుంచి 23 మంది బాలికలు సహా 27 మంది గల్లంతయ్యారు. తుఫాను సెంట్రల్ టెక్సాస్ మీదుగా కదులుతున్నందున మరిన్ని భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ వెదర్ […]
ఇటీవల శంకర్ పల్లిలో ఓ యువతి రైల్వే ట్రాక్ పై కారు నడిపి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేయడంతో రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్ లో చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఆటోను రైల్వే ట్రాక్ పైకి తీసుకొచ్చి నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. బీహార్‌లోని సీతామర్హి-దర్భంగా […]
17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్‌లోని రియో డి జనీరో చేరుకున్నారు. గలేయో అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం లభించింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి బ్రెజిల్‌కు రెండు దశల పర్యటన ఇది. ఈ పర్యటనలో, రియోలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న తర్వాత ప్రధాని రాజధాని బ్రెసిలియాకు రాష్ట్ర పర్యటన చేస్తారు. Also Read:Elon Musk: ఎలాన్ మస్క్ […]
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య దెబ్బతిన్న సంబంధం మరో వివాదాస్పద మలుపు తిరిగింది. బిలియనీర్, ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించారు. గతంలో, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందితే, అమెరికాలో కొత్త పార్టీ ఏర్పడుతుందని మస్క్ ట్రంప్‌ను హెచ్చరించారు. అమెరికా 249వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చనీయాంశమైన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై సంతకం చేశారు. Also Read:Off The […]
బజాజ్ ఆటో భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ-వీలర్ తయారీ సంస్థలలో ఒకటి. తాజాగా బజాజ్ ఆటో తన ప్రసిద్ధ స్పోర్ట్స్ టూరింగ్ బైక్ సిరీస్ 2025 బజాజ్ డొమినార్ 250, డొమినార్ 400 లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ అనేక ఆధునిక ఫీచర్లు, మెరుగైన ఎర్గోనామిక్స్, టూరింగ్ సామర్థ్యాలను మరింత ఆకర్షణీయంగా మార్చే సాంకేతిక అప్గ్రేడ్లతో వస్తున్నాయి. సుదూర రైడింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేయడానికి అనేక ఎర్గోనామిక్ మార్పులు […]
హైదరాబాద్ MCRHRD లో స్టేట్ లెవెల్ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ మీట్-2025 కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ అనే థీమ్ తో.. తమ బాధను చెప్పుకోలేని వారికి రక్షణ కల్పించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఎంతో కీలకమైన అంశంపై సదస్సు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసు, ఇతర నిర్వాహకులను […]
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. “నీటికి పల్లం ఎలా తెలుసో తెలంగాణ కు నీరు ఎవరు తీసుకు వచ్చారో అందరికి తెలుసు.. తెలంగాణ లో ఏ రైతు ను, ఎద్దును అడిగినా వ్యవసాయం పండుగ ఎవరు చేశారో చెప్తారు.. సీఎం నిన్న రంకెలు వేశాడు.. ఆయన సభ పెట్టాడంటే బూతులతోనే మాట్లాడతాడు.. మా పార్టీ తరుపున మీ సవాలు స్వీకరిస్తున్నాం.. ఎక్కడ […]
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దాడి చేసి ముగ్గురిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు పాల్పడిన ఆల్ ఖైదా ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ. కిడ్నాప్ కు గురైన వారిలో ఏపీకి చెందిన అమరలింగేశ్వర్ రావు ఉన్నారు. అమరలింగేశ్వర్రావు స్వగ్రామం జమ్మలమడక, మాచర్ల మండలం, పల్నాడు జిల్లా. మిర్యాలగూడలో నివాసం ఉంటున్న అమరలింగేశ్వర భార్య రమణ, పిల్లలు.. రెండు నెలల క్రితమే తన కుటుంబాన్ని […]