ఏపీలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వృద్ధాప్య పెన్షన్, తల్లికి వందనం, దీపం పథకం ద్వారా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఈ విషయాలను ప్రభుత్వ ప్రజలకు వివరించనుంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. వివిధ కేసుల్లో ఆయన 138 రోజులుగా విజయవాడ సబ్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
జర్మన్ యువరాజు హెరాల్డ్ వాన్ హోహెన్జోలెర్న్(63) గుండెపోటుతో మరణించారు. వజ్రాల వ్యాపారంలో భాగంగా ఆయన నమీబియా దేశ పర్యటనకు వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు.
ప్రధాని మోడీ ఒకేసారి ఐదు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. మంగళవారం నుంచి 8 రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఘనా, ట్రినిడాడ్ మరియు టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ప్రధాని పర్యటించనున్నారు.
వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు. అంతేకాకుండా సమీపంలోని ఇరుగుపొరుగు నివాసాలు. ఇక చదువులో ఒకరి కంటే మరొకరు ఎక్కువగా చదువుతున్నారు. అదే మరొకరికి పగ రగిలించింది. స్నేహితురాలిపై అసూయ పెంచుకుంది.
తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. పోలీస్ కస్టడీలో ఆలయ గార్డు అజిత్ కుమార్ మరణించిడంపై పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపుతోంది. డీఎంకే పాలనలో లాకప్ డెత్‌లకు రాష్ట్రం మాతృభూమిగా మారిందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
థాయ్‌లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా(37) సస్పెన్షన్‌కు గురయ్యారు. కాంబోడియా మాజీ నేతతో దౌత్యపరమైన సంభాషణం చేయడంపై ఇరాకటంలో పడ్డారు. థాయ్‌లాండ్‌కు సంబంధించిన పాలనా అంశాలు.. పరాయి దేశ నేతతో పంచుకోవడంపై సంకీర్ణ ప్రభుత్వంలోని నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను మొదటి నుంచి మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మస్క్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న ప్రియురాలిని చంపి బెంగళూరు మున్సిపాలిటీ చెత్త ట్రక్కులో పడేశాడు ఓ ప్రియుడు. ఈ ఘటన మరువక ముందే భోపాల్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.