తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి.. ఇక, సామాన్యుడికి అధికారం.. సామజిక సమన్యాయం దిశగా తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ).. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో బీసీవై దూసుకెళ్తుంది.. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అభ్యర్థుల ఎంపిక సహా ఇతర వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారు.. ఈ క్రమంలోనే ఎన్నికల్లో అత్యంత కీలకమైన “ఎన్నికల మేనిఫెస్టో”ను ఆ పార్టీ విడుదల చేసింది. 18 కీలక అంశాలతో రూపొందిన ఈ మేనిఫెస్టోలో […]
విజయనగరం రైలు ఘటన పరిస్థితులు ప్రత్యక్షంగా చూసిన తర్వాత స్పందిస్తూ మరో ట్వీట్ చేశారు సీఎం జగన్.. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రికి అభ్యర్థించారు సీఎం జగన్.. 'నిన్న రాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నన్ను చాలా బాధించింది.. రన్నింగ్లో ఉన్న రైలు మరో రైలును ఢీ కొట్టింది, రెండూ ఒకే దిశలో నడుస్తున్నాయి.. ఈ భయంకరమైన ప్రమాదం కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.
చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసింది సీఐడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై కొత్త కేసు నమోదు చేసింది సీఐడీ. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది.
టీడీపీ అంతర్గతంగా దివాళా తీసింది.. అందుకే రైల్వే క్షతగాత్రుల పరామర్శకు భువనేశ్వరి వెళ్తున్నారని విమర్శించారు. ఆమె టీడీపీ అధ్యక్షురాలు కానున్నారా? లోకేష్ ఏమయ్యాడు? ఎందుకు దూరం పెడుతున్నారు? అంటూ అనుమానం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఈ నెల 31వ తేదీన జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 31వ తేదీన అనగా రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది.. దీనిపై గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రేపటి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ఈ రోజు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
2024లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. ఆంధ్రప్రదేశ్ఖి ప్రత్యేక హోదా వస్తుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్రావు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ రోజు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది.. పలు పరిశ్రమల ప్రతిపాదనలకు, ప్రోత్సాహకాలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.. ఈ సమావేశంలో మొత్తంగా రూ.19,037 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది.. వాటి ద్వారా 69,565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి..