ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలకు విచ్చేయనున్నారు.. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.. ఇక, ప్రధాని మోడీ తిరుమల పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదల చేశారు పీఎంవో అధికారులు.. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.
అందెల శ్రీరాములు యాదవ్ ని కలిసి మద్దతు ప్రకటించింది నిరుద్యోగ జేఏసీ.. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు అంతా బీజేపీకి సపోర్ట్ చేసి.. అందెల శ్రీరాములు యాదవ్ కి గెలిపించుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు నిరుద్యోగ జేఏసీ నేతలు.
ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూర్ సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ చౌదరి డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎటువంటి సాక్షాదారులు లేకుండా కేసులు నమోదు చేసి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి సీఐడీలను ప్రయోగించి ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు.. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.
ఈ పెళ్లిళ్ల సీజన్లో భారీగా ఖర్చు అవుతుందని వ్యాపారుల సమాఖ్య కాయిట్ అంచనా వేస్తోంది.. ఏకంగా రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.. గత ఏడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువని చెప్పుకొచ్చింది.. పెళ్లిళ్లకు అవసరమైన వస్తువులు, వివిధ సేవల కోసం వినియోగదార్లు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా అదనంగా ఖర్చు చేయబోతున్నారని తెలిపింది.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లో ఉన్న వస్తు, సేవలకు సంబంధించిన వాణిజ్య సంస్థల…