రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో చాలా మార్పులు ఉండబోతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వైవీ సుబ్బారెడ్డి.. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిపించుకోవాలన్నదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితుల దృష్ట్యా మార్పులు, చేర్పులు చేస్తున్నాం.. గాజువాక నియోజకవర్గంలో కూడా సమన్వయకర్తని మార్పు చేయాలని పార్టీ ఆదేశించింది అన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ పదవికి జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయడం.. ఆయన రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపినట్టు కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి.. అయితే, జనార్ధన్ రెడ్డి రాజీనామా వ్యవహారంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. జనార్ధన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని రాజభవన్ వర్గాలు వెల్లడించాయి.
గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వైవీ సుబ్బారెడ్డితో సమావేశం అయ్యారు ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఆయన కుమారుడు దేవన్ రెడ్డి.. హైకమాండ్ నిర్ణయం వెనుక కారణాలు వారికి చెప్పి బుజ్జగించారు వైవీ. దీంతో, రాజీనామా విషయంలో దేవన్ రెడ్డి వెనక్కి తగ్గారు.. అసలు తాను రాజీనామా చేయలేదని అంటున్నాడు.. ఇక, నేను గాని, నా కుమారులు గానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తులం.. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ శ్రేయస్సు కోసం కంకణబద్ధులై ఉంటామని…
మా టార్గెట్ 175 సీట్లు.. జగనన్న మా టీం కెప్టెన్ అని స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.. నియోజకవర్గ మార్పుపై స్పందించిన ఆయన.. నియోజకవర్గ మార్పుపై పార్టీ నిర్ణయమే శిరోధార్యం అన్నారు.
175 నియోజకవర్గాల్లో.. సర్వేలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన చేపట్టారు. గెలిచే అవకాశం లేని నేతలను పక్కన పెట్టాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను రంగులో దింపుతున్నారు. 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది. ఇందులో 5 ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి ఫేజ్‌లో నలుగురికి స్థాన చలనం కల్పించారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కొండేపి, మేకతోటి సుచరితకు తాడికొండ, మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. మరో మంత్రి విడుదల రజినికి చిలకలూరిపేట నుంచి గుంటూరు…
ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది విచారణ.. ఈ రోజు మరోసారి విచారణకు రానుంది చంద్రబాబు పిటిషన్