సీఎం వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. గత నెల నవంబర్మూడో తేదీన జరిగిన కేబినెట్ భేటీలో కొన్ని కంపెనీలకు విచిత్రమైన ప్యాకేజీలు ప్రకటించారు. దుకాణం మూసేసే ముందు క్లియరెన్స్ సేల్స్ పెట్టినట్టు.. వైఎస్ జగన్ కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల పేరుతో జగన్ క్లియరెన్స్ సేల్స్ మొదలు పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..
తనకు నియోజకవర్గం మార్పుపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు మంత్రి మేరుగ నాగార్జున.. వేమూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి బొమ్మపై గెలిచాను.. ఇప్పుడు సంతనూలపాడు నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా ఉన్నానని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
సీఎం జగన్ రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.. గురువారం రోజు పలాస పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు సీఎం జగన్.. ఈ పర్యటనలో డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న సీఎం.. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు
మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ 2023లో హైదరాబాద్ "భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం"గా ర్యాంక్ చేయబడింది.. ఈ జాబితాలో 153వ ర్యాంక్‌తో హైదరాబాద్ టాప్ స్పాట్లో నిలవగా.. ఆ తర్వాత 154వ ర్యాంక్‌తో పుణె రెండో స్థానం, 156వ ర్యాంక్‌తో బెంగళూరు మూడో స్థానం, 161 ర్యాంక్‌తో చెన్నై నాలుగో స్థానం, 164 ర్యాంక్‌తో ముంబై ఐదో స్థానం, 170 ర్యాంక్‌తో కోల్‌కతా ఆరో స్థానం, 172 ర్యాంక్‌తో న్యూఢిల్లీ ఏడో స్థానంలో నిలిచాయి.
మీరు యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు చేస్తున్నారా? అయితే మీకు ఇది శుభవార్త. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని వర్గాల కోసం యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు పరిమితిని భారీగా పెంచింది.. ఇప్పటి వరకు రోజువారీగా యూపీఐ చెల్లింపులు గరిష్టంగా రూ.15 వేల వరకు మాత్రమే ఆర్బీఐ అనుమతించింది. కానీ, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ పుంజుకోవడంతో రోజువారీ ఆటోమేటిక్ పేమెంట్స్ పరిమితిని రూ.లక్షకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది.
రెండు రోజుల పాటు మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.. తుఫాన్‌తో నష్టపోయిన పంటలను, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయనున్నారు.. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయడానికి ఈ రోజు రాష్ట్రానికి కేంద్ర బృందం రాబోతుందని.. నేడు కృష్ణా, బాపట్ల జిల్లాల్లో, రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తారని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు బిజీగా గడపనున్నారు.. వరుస సమీక్షలతో పాటు.. ఈ రోజు సాయంత్రం తిరుపతి పర్యటనకు వెళ్లనున్నారు సీఎం జగన్.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నేడు ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించనున్న ఆయన.. ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల జారీతో పాటు.. ధాన్యం సేకరణపై అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు ఏపీ సీఎం.
Sri Shobhakruth Nama Samvatsaram, Margasira Masam, Shukla Paksham, Poli Swarga Deepam, Sri Shiva Stotra Parayanam, Brahmasri Nori Narayana Murthy, Bhakthi TV
Sri Shobhakruth Nama Samvatsaram, Margasira Masam, Shukla Paksham, Wednesday Special, Sri Vishnu Sahasranama Stotram, Sri Lakshmi Sahasranama Stotram, Bhakthi TV