ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూ వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ విడుదల చేశారు.. పొత్తుల్లో భాగంగా మొత్తం 144 అసెంబ్లీ స్థానాలకు, 17 లోక్సభ స్థానాల నుంచి టీడీపీ బరిలోకి దిగనున్న విషయం విదితమే కాగా.. ఈ రోజు నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుకు కీలక బాధ్యతలు అప్పగించింది టీడీపీ.. దేవినేని ఉమాకు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పచెప్పింది.. ఇప్పటికే ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు ఉమకు అదనపు బాధ్యతలు అప్పగించినట్టు టీడీపీ ఏపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు